JDU in Uttar Pradesh: జేడీయూ పార్టీ(జనతా దళ్ యునైటెడ్) మరో సమరానికి సిద్ధమవుతోంది. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడేందుకు జేడీయూ రెడీ అంటోంది. జేడీయూ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్.. తమ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. గత ఆదివారం లాలన్ సింగ్‌ను జేడీయూ అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా నియామకం అయిన తరువాత.. తొలిసారి రాష్ట్ర రాజధాని పాట్నాకు వచ్చిన ఆయన.. కార్యకర్తలనుద్దేశించి కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేస్తుందన్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా జేడీయూ పోటీచేసి విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు.
జూలై 31 న న్యూఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో లాలన్ సింగ్ జెడి (యు) జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అయితే, ఎంపీ అయిన లాలన్ సింగ్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇన్నిరోజులు ఢిల్లీ లోనే ఉన్నారు. శుక్రవారం నాడు.. ఆయన పాట్నాకు వచ్చారు. పార్టీ అత్యున్నత పదవి చేపట్టాక.. రాష్ట్ర రాజధానిలో తొలిసారి పర్యటించిన ఆయనకు పార్టీ నాయకులు.. కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన లాలన్ సింగ్.. ‘పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రతిష్ట, గౌరవాన్ని కాపాడటానికి పని చేస్తానని, సంస్థాగత పనులలో పార్టీ కార్యకర్తలకు తగిన భాగస్వామ్యం అందేలా చూస్తాను.’ అని హామీ ఇచ్చారు.
Also read: