రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా ఎంతో సరదాగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ప్రజలు తమ ప్రియమైన వారితో కలిసి హోలీ జరుపుకుంటున్న వీడియోలు,ఫోటోలతో నిండిపోయాయి. ఈ వేడుకల దృశ్యాల మధ్య, హోలీ వేడుకలో జపాన్ టూరిస్ట్‌ను కొందరు యువకులు అసభ్యకరంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోలీ సందర్భంగా మహిళలతో కొందరు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో కొంతమంది అబ్బాయిలు రోడ్డుపై జపాన్ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. బాలికకు రంగు రాసి ఆమెను ఇబ్బందిపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది మహిళలు దీనిని లైంగిక వేధింపుగా అభివర్ణించారు. దీంతో పాటు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనను గమనించిన ఢిల్లీ పోలీసులు, వీడియోలో చూసిన దృశ్యాలు, గుర్తుల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ వీడియో పహార్‌గంజ్‌కి సంబంధించినదని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఆ ప్రాంతంలో అలాంటి సంఘటన ఏదైనా జరిగిందా లేదా అనేదానిపై ఆరా తీస్తున్నారు. పహర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఏ విదేశీయుడితో ఎలాంటి అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదు లేదా కాల్ రాలేదని పోలీసులు తెలిపారు.
Arrest these men https://t.co/zgC1bDh1kB
— RichaChadha (@RichaChadha) March 10, 2023
ఇదిలా ఉంటే, వైరల్‌గా మారిన వీడియోలో బాధిత యువతి పోకిరీల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను చుట్టుముట్టిన యువకుల నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె వారికి దూరంగా వెళ్ళేలోపు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడో వ్యక్తి.. దాంతో ఆగ్రహించిన యువతి..పట్టుకోవడానికి ప్రయత్నించినన వ్యక్తిని చెంపదెబ్బ కొట్టడం కూడా వీడియోలో కనిపించింది. వీడియోలో మహిళ పూర్తిగా తడిసిపోయి దాదాపుగా గుర్తుపట్టలేని విధంగా కనిపించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..