Pawan Kalyan: అక్కడ కూడా సేనాని హవా.. బీజేపీకి కలిసొచ్చిన పవన్ ప్రచారం
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి బిగ్ విక్టరీ దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ కూటమి అధికారం చేపట్టటం పక్కా అని తేలిపోయింది. ఇదే సమయంలో బీజేపీకి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ కూటమి ఆధిక్యత కనబరచడం ఆసక్తికరంగా మారింది.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో చేసిన చోట బీజేపీ కూటమి విజయభేరి మోగిస్తోంది. ఆయన మహారాష్ట్రలోని అనేక చోట్ల ప్రచారం చేశారు. పలుచోట్ల జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని రక్షించాలని, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న పవన్ కల్యాణ్ అక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూణే, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ లలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పూణే, బల్లార్ పూర్, షోలాపూర్ లో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. డెత్లూర్, లాతూర్ లలో హోరాహోరీ పోరు సాగుతుంది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి మహా ప్రభంజనం
మహారాష్ట్రలో మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహిళా ఓటర్లు, మరాఠాలు, ఓబీసీలు కులాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమన్న మోదీ మాటను మరాఠాలు నమ్మారు. అలాగే గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని.. కర్నాటక, తెలంగాణలను ఉదాహరణలుగా చూపారు ప్రధాని. మహాయుతి హామీ ఇచ్చిన ఉచిత పథకాలు కూడా ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థం అవుతోంది.
— దీంతో.. 50శాతానికి పైగా ఓట్లను సాధించింది కూటమి. కులగణనకు వ్యతిరేకంగా మోదీ ఏక్‌తో సేఫ్ హై నినాదం బాగా పని చేసింది. దీంతోపాటు.. మహాయుతికి మెజార్టీ కట్టబెట్టిన స్కీముల్లో లాడ్లీ బెహన్ కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. మహిళలకు నెలకు ప్రస్తుతం అందిస్తున్న 15వందల సాయాన్ని తాము గెలిస్తే 2వేల 100కు పెంచుతామన్న.. మోదీ హామీలకు జై కొట్టారు మరాఠా మహిళలు.
— దేశంలో ఎక్కడా లేని విధంగా.. మహారాష్ట్రలో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ కూటమి. అలాగే రైతులకు షెట్కారీ సమ్మాన్ యోజన కింద ఏటా రూ.15వేలు ఇస్తామని చెప్పింది. విద్యార్థులకు 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..