Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభంజనం.. ఇంతకీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?

కాంగ్రెస్ గ్యారంటీలు ఏవీ.. మహారాష్ట్రలో ఒక్కశాతం కూడా పనిచెయ్యలేదు. అందుకే ఈ రిజల్ట్స్ వచ్చాయని.. బీజేపీ నేతలు చెప్తున్నారు.

Maharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభంజనం.. ఇంతకీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?
Eknath Shinde, Devendra Fadnavis
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 23, 2024 | 11:51 AM

మహారాష్ట్రలో మహాయుతి కూటమి మహా ప్రభంజనం సృష్టించింది. మహాయుతి వేసిన రెండు బ్రహ్మాస్త్రాలు ఇండియా కూటమి నిలబడలేకపోయింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. మహారాష్ట్ర ప్రజలు మహాయుతికి అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇంతకీ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు? దీనిపై చర్చ జరుగుతోంది. దీనిపై బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ స్పందించారు. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ అవుతారని ప్రవీణ్ దరేకర్ జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ గ్యారంటీలు ఏవీ.. మహారాష్ట్రలో ఒక్కశాతం కూడా పనిచెయ్యలేదు. అందుకే ఈ రిజల్ట్స్ వచ్చాయని.. బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎన్నికల సమయంలో.. మహిళలకు నెలకు రూ.3వేలు, ఉచిత్ బస్ సదుపాయం. 3లక్షల రుణమాఫీ, 4వేల నిరుద్యోగ భృతి, కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా లాంటి కీలక హామీలిచ్చింది మహావికాస్‌ అఘాడీ. కానీ.. ఇవేమీ మహారాష్ట్ర ప్రజలు పట్టించుకోలేదన్నది ఫలితాల తర్వాత అర్థం అవుతోంది.

మహారాష్ట్ర ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మహాయుతి కూటమిలో సీఎం పదవి కోసం పోటీ మొదలయ్యింది. 120కి పైగా సీట్లు సాధించిన తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ముంబైలో ఫడ్నవీస్‌ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఫడ్నవీస్‌నే సీఎం చేయాలన బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫడ్నవీస్‌ సీఎం అవుతారని అన్నారు బీజేపీ నేత ప్రవీణ్‌ దారేకర్‌

అయితే ఏక్‌నాథ్‌షిండే తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో షిండే నే సీఎం అభ్యర్ధి అని బీజేపీ నేతలు ప్రకటించారని, అందుకే ఆయనే మరోసారి సీఎం అవుతారని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంలో షిండేదే కీలక పాత్ర.. మరాఠా ఓటు బ్యాంక్‌ను మహాయుతి కూటమి వైపు తిప్పడంలో షిండే కీలకపాత్ర పోషించారు. అంతేకాకుండా మరాఠా రిజర్వేషన్ల పోరాట సమితి నేత మనోజ్‌ ఝారంగి ప్రభావం తమ కూటమి వైపు పడకుండా వ్యూహాన్ని రచించారు షిండే. వాస్తవానికి ఎన్నికల కంటే ముందే షిండేను సీఎం చేసి మహా వికాస్‌ అఘాడి కూటమిపై బీజేపీ గుగ్లీ ప్రయోగించింది. మరాఠా ఓటు బ్యాంక్‌తో పాటు శివసేన ఉద్దవ్‌ వర్గాన్ని బలహీనపర్చడంలో షిండే కీలక పాత్ర పోషించారు.

ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు మరోలా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. అసూయపడడం ద్వేషం కానీ ఓటర్లు నిశ్శబ్దంగా ఓటు వేశారని ప్రవీణ్ దారేకర్ తెలిపారు. లోక్‌సభలో జరిగిన పొరపాటు ఇప్పుడు సరిదిద్దుకున్నట్లు కనిపిస్తుంది.లోక్ సభ తప్పు చేసిందని ప్రజలు విచారం వ్యక్తం చేశారు. లోక్‌సభలో నరేంద్ర మోదీకి మద్దతివ్వడంలో ప్రజలు వెనుకబడ్డారని గ్రహించారని ప్రవీణ్ దారేకర్ అన్నారు. గత రెండున్నరేళ్లలో మహాకూటమి ప్రభుత్వం ఏం చేసింది. ప్రజలు ఆయనకు మద్దతు పలికారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారు. అభివృద్ధి చేశారు. అందుకే ప్రజలు తిట్టేవారి వెంట వెళ్లరని ప్రవీణ్ దారేకర్ అన్నారు.

మరోవైపు, శివసేన ఠాక్రే ఎంపీ సంజయ్ రౌత్‌పై ప్రవీణ్ దారేకర్ విమర్శలు గుప్పించారు. సంజయ్ రౌత్ విమానాన్ని ఇప్పుడు నేలపై దింపాలి. దుర్వినియోగం వల్ల మాత్రమే విజయం లేదు. గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవాలి. ప్రజలు అభివృద్ధికి అనుకూలంగా ఓట్లు వేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ పిలుపునిచ్చిన మత యుద్ధం. అందుకు ‘మనమంతా ఒక్కటే’ అనే నినాదానికి జనం పెద్దఎత్తున ఆమోదం తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వం వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించారు. అందుకే ప్రజలు ఈ ఓటు వేశారని ప్రవీణ్ దరేకర్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..