AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ప్రమాదం.. లోయలో పడి ముగ్గురు సైనికులు మృతి

ఆర్మీ అధికారులకు లోతైన లోయ ప్రాణ సంకటంగా మారింది. సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్న ముగ్గురు ఆర్మీ అధికారుల ప్రాణాలో పోయాయి. వివరాల్లోకి వెళితే..

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ప్రమాదం.. లోయలో పడి ముగ్గురు సైనికులు మృతి
Indian Army
Subhash Goud
|

Updated on: Jan 11, 2023 | 12:43 PM

Share

ఆర్మీ అధికారులకు లోతైన లోయ ప్రాణ సంకటంగా మారింది. సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్న ముగ్గురు ఆర్మీ అధికారుల ప్రాణాలో పోయాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి బుధవారం మచిల్ సెక్టార్‌లోని లోతైన లోయలోకి జారిపడి ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జేసీవో)తో పాటు మరో ఇద్దరు సైనికులు మరణించారు. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి సాధారణ పెట్రోలింగ్‌లో లోతైన లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఇండియన్‌ ఆర్మీ అధికారులు తెలిపారు.

శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ట్వీట్ చేస్తూ, ఫార్వర్డ్ ఏరియాలో సాధారణ పెట్రోలింగ్ ఆపరేషన్ సమయంలో ఒక JCO, మరో ఇద్దరు జవాన్లు మంచులో జారిపడి లోతైన లోయలో పడిపోయారు. ముగ్గురి మృతదేహాలు బయటకు తీసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా, గతేడాది నవంబర్ 18న మచిల్ సెక్టార్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హిమపాతం కారణంగా ముగ్గురు సైనికులు మరణించారు. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్‌లో ఆర్మీకి చెందిన 56 రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్‌ఆర్)కి చెందిన ముగ్గురు సైనికులు హిమపాతం బారిన పడ్డారని అధికారులు గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

చికిత్స కోసం తీసుకెళ్తుండగా ప్రమాదం..

మచిల్ సెక్టార్‌లో భారత ఆర్మీకి చెందిన పెట్రోలింగ్ పార్టీకి చెందిన ఇద్దరు సైనికులు తమ సహచరులను చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగిందని శ్రీనగర్‌కు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కల్నల్ అమ్రోన్ మూసావి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి