Farooq Abdullah: పరిస్థితి ఇలాగే ఉంటే గాజా, పాలస్తీనా లాగా మారుతుంది.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య వివాదాల పరిష్కారానికి ప్రధాని మోదీ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ అంశంలో పాకిస్థాన్‌తో మాట్లాడేందుకు మోదీ సిద్ధంగా లేరని ఆరోపించారు. ఒకవేళ ఈ అంశంలో చర్చలు ప్రారంభించకపోతే గాజా, పాలస్తీనా తరహా పరిస్థితులను ఎదుర్కోవాలని వస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య వివాదాల పరిష్కారానికి ప్రధాని మోదీ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ అంశంలో పాకిస్థాన్‌తో మాట్లాడేందుకు మోదీ సిద్ధంగా లేరని ఆరోపించారు. ఒకవేళ ఈ అంశంలో చర్చలు ప్రారంభించకపోతే గాజా, పాలస్తీనా తరహా పరిస్థితులను ఎదుర్కోవాలని వస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, లేకుంటే మన పరిస్థితి గాజా, పాలస్తీనాలా తయారవుతుందని అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాలేదని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఇది గతంలో కంటే ఎక్కువగా జరుగుతోందన్నారు. ముస్లింలు, హిందువులు మనం ఒకరికొకరు శత్రువులమని భావించేంతగా ద్వేషం పెరిగిపోయిందన్నారు ఆయన. పాకిస్థాన్‌లో నవాజ్ షరీఫ్ వజీర్ ఆజం కాబోతున్నాడు. ఆయన చర్చలకు సిద్ధమైతే మనం ఎందుకు చేయకూడదన్నారు ఫరూక్ అబ్దుల్లా.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రకటనను ప్రస్తావించిన ఫరూక్ అబ్దుల్లా.. స్నేహితులను మార్చవచ్చు, పొరుగువారిని మార్చలేరు. మన పొరుగువారితో స్నేహంగా ఉంటే, ఇద్దరూ పురోగమిస్తారన్నారు. వారితో శత్రుత్వంతో ఉంటే, మనం త్వరగా అభివృద్ధి చెందలేమన్నారు ఫరూక్ అబ్దుల్లా. నేటి యుగంలో యుద్ధం అనేది ఒక ఆప్షన్ కాదని మోదీజీ స్వయంగా చెప్పారన్నారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు ఫరూక్ అబ్దుల్లా.
#WATCH | National Conference MP Farooq Abdullah says, "Atal Bihari Vajpayee had said that we can change our friends but not our neighbours. If we remain friendly with our neighbours, both will progress. PM Modi also said that war is not an option now and the matters should be… pic.twitter.com/EcPx9B70jJ
— ANI (@ANI) December 26, 2023
అయితే ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు . కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆర్మీ జవాన్లపై దాడి చేసి ఐదుగురిని హత్య చేసిన వేళ ఫరూక్ శాంతి ప్రవచనాలు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఇదిలావుంటే జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో డిసెంబర్ 21న ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్‌పై మెరుపుదాడి చేశారు. రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ సైనికులు కూడా వెంటనే ప్రతీకారం తీర్చుకుని కొందరు ఉగ్రవాదులను హతమార్చారు. నెల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…