Jammu Kashmir Assembly Election: జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు.. తొలి విడత పోలింగ్ ప్రారంభం..

|

Sep 18, 2024 | 7:30 AM

జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుతున్నాయి.. కేంద్రపాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో 24 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Jammu Kashmir Assembly Election: జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు.. తొలి విడత పోలింగ్ ప్రారంభం..
Jammu Kashmir Assembly Election
Follow us on

జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుతున్నాయి.. కేంద్రపాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో 24 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కశ్మీర్‌లో 16, జమ్ములో 8 స్థానాల్లో 3 వేల 276 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 23 లక్షల 27 వేల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎల్‌వోసీ దగ్గరున్న పోలింగ్ స్టేషన్లను అదనపు బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతోపాటు అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు.

కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) పొత్తు పెట్టుకున్నాయి. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి), భారతీయ జనతా పార్టీ (బిజెపి), పీపుల్స్ కాన్ఫరెన్స్, ఇతర పార్టీలు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ దశలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీల భవితవ్యం తేలనుంది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ కూడా తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు.

2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్ జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఓటింగ్‌లో ఎవరూ ఎలాంటి అవాంతరాలు సృష్టించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిర్డి తెలిపారు. బహుళస్థాయి భద్రతలో భాగంగా కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాలు (సిఎపిఎఫ్), పోలీసులను మోహరించినట్లు తెలిపారు.

అక్టోబర్ 8న ఫలితాలు..

జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 (ఇవాళ), సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 వరకు జమ్మూ కాశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

కాగా.. 2014 ఎన్నికల్లో పీడీపీ అత్యధికంగా 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు గెలుచుకున్నాయి. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..