Jammu and Kashmir: భారత అర్మీ జవాన్లపై జరిగిన పూంచ్ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఈ దాడి జరిగిన జమ్మూ కాశ్మీర్‌లోని ప్రాంతానికి NIA అధికారులు ఇప్పటికే చేరుకుని ధర్యాప్తు చేస్తున్నారు. ఇంకా రాజౌరి-పూంచ్ సెక్టార్‌లో కూడా ఆర్మీ కూంబింగ్ నిర్విహిస్తున్నారు. అనుమానాస్పద ప్రాంతంలో డ్రోన్‌లు, నిఘా హెలికాప్టర్‌లతో పాటు పలు ప్రత్యేక దళాల బృందాలను సైన్యం ప్రారంభించింది. ఆర్మీ, పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సహా భద్రతా దళాలు కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల స్థావరాలను మన ఆర్మీ గుర్తించినట్లుగా సమాచారం. అలాగే మొత్తం 7 మంది ఉగ్రవాదులు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వారు గుర్తించారు. కూంబింగ్ సమయంలో పలువురు అనుమానితులను కూడా ప్రశ్నించారు మన ఆర్మీ.
కాగా, గురువారం జరిగిన పూంచ్ ఉగ్రదాడిలో ఐదుగురు భారత ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. వారితో పాటు ఒకరికి గాయాయ్యాయి. ఇక ఈ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన సమాచారం అందడంతో.. జాతీయ భద్రతా దళాలు బటా-డోరియా ప్రాంతంలోని దట్టమైన అడవులలో సెర్చింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అలాగే ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన ఎల్‌ఈటీ(లష్కరే తోయిబా)కి సంబంధించినవారిగా అనుమానిస్తున్నారు. ఇక అంతకమందు ఈ ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని ఉగ్రవాదుల నుంచి కాల్పులు జరిగాయని ఆర్మీ తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.