Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్‌ ‌ ఫెర్నాండేజ్‌కు బిగుస్తున్న ఉచ్చు.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..

మనీలాండరింగ్‌ కేసులో సెప్టెంబర్‌ 26వ తేదీన హాజరుకావాలని జాక్వెలిన్‌ ‌ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ ఆధారంగా జాక్వెలిన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.

Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్‌ ‌ ఫెర్నాండేజ్‌కు బిగుస్తున్న ఉచ్చు.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..
Jacqueline Fernandez

Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:09 PM

Jacqueline Fernandez Summoned by Delhi Court: బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ‌ ఫెర్నాండేజ్‌కు మళ్లీ కోర్టు కష్టాలు వచ్చాయి. మనీలాండరింగ్‌ కేసులో సెప్టెంబర్‌ 26వ తేదీన హాజరుకావాలని జాక్వెలిన్‌ ‌ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ ఆధారంగా జాక్వెలిన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఛార్జ్‌షీట్‌లో దాఖ‌లు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుకేశ్ పై న‌మోదు చేసిన స‌ప్లిమెంట‌రీ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును చేర్చారు. ఆర్థిక నేర‌స్థుడు సుకేశ్ చంద్రశేఖ‌ర్ నుంచి జాక్వెలిన్ ఖ‌రీదైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ మ‌నీలాడ‌రింగ్ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ గతంలోనే విచారించింది. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన రూ.7 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది.

200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో వ్యక్తులను మభ్యపెడుతున్నారనే ఆరోపణలపై బెంగళూరుకు చెందిన సురేష్ పై 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అతనితో జాక్వెలిన్ ఉన్న చిత్రాలు వైరల్ కావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. అయితే.. ఈడీ‌ అటాచ్‌ చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ స్పష్టం చేసింది. అవి రూ. 200 కోట్ల కుంభకోణంలో మనీల్యాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఇచ్చిన బహుమతులు కాదని ఆమె వెల్లడించారు. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్‌ ప్రొసీడింగ్స్‌ను నిలిపి వేయాలని ఈడీని కోరారు.

ఇవి కూడా చదవండి

మాయగాడు సుకేశ్‌తో పరిచయం లేనప్పుడే, ఎఫ్‌డీలపై పన్ను చెల్లించినట్లు ఈడీకి ఇచ్చిన సమాధానంలో జాక్వెలిన్‌ తెలిపారు. ఇది తన సొంత సంపాదన అని.. ఆ సమయంలో తన ప్రపంచంలో చంద్రశేఖర్‌ లేడని పేర్కొంది. అతనే ఖరీదైన గిఫ్టులు తీసుకోవాలని బలవంతం చేసేవాడని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. కాగా.. జాక్వెలిన్ చివరిసారిగా కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోనాలో కనిపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి