Afghanistan Crisis: తాలిబన్ల చెర నుంచి 62 మంది భారతీయులు సేప్.. కీలకపాత్ర పోషించిన ITBP కమాండోలు..

|

Aug 19, 2021 | 9:40 AM

కాందహార్‌లో చిక్కుకున్న 62 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారు. ITBP కమాండోలు వారిని క్షేమంగా కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు చేర్చారు. తాలిబన్ల చెర నుంచి వారిని విడిపించడంలో తెలుగు జవాన్లు కీలక పాత్ర పోషించారు.

Afghanistan Crisis: తాలిబన్ల చెర నుంచి 62 మంది భారతీయులు సేప్.. కీలకపాత్ర పోషించిన ITBP కమాండోలు..
Itbp Commandos
Follow us on

కాందహార్‌లో చిక్కుకున్న 62 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారు. ITBP కమాండోలు వారిని క్షేమంగా కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు చేర్చారు. తాలిబన్ల చెర నుంచి వారిని విడిపించడంలో తెలుగు జవాన్లు కీలక పాత్ర పోషించారు. ITBP కమాండోస్‌ సురేష్‌, రాజశేఖర్‌, KP రెడ్డి.. తాలిబన్లతో చర్చించి వారిని ఒప్పించి.. 62మంది ఇండియన్స్‌ను క్షేమంగా కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు చేర్చారు. తమ ఆయుధాలను అప్పగించి మరీ.. భారతీయులను C-17 విమానం వద్దకు చేర్చారు. తుపాకులు చేతబట్టిన తాలిబన్లు రాజధాని కాబుల్‌ సహా ఎక్కడ చూసినా గుంపులు.. గుంపులుగా తిరుగుతుంటే.. అఫ్గాన్‌ ప్రజలతోపాటు విదేశీయులు బిక్కు..బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్న వారందర్నీ ఆగమేఘాలపై మన దేశానికి తీసుకొచ్చేందుకు ఇండియా తరలింపు ఆపరేషన్‌ చేపట్టింది. దీనిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన P.రాజశేఖర్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ITBPలో సీనియర్‌ కమాండోగా పదమూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆయన రెండేళ్లుగా డిప్యుటేషన్‌పై అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్నారు.

విదేశాంగశాఖ ప్రతినిధులు, అధికారులను రెండు విడతలుగా స్వదేశానికి చేర్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌ ఆ క్రమంలో ఎదురైన అవరోధాలు, వాటిని ఎలా అధిగమించామో వారు చేస్తున్న ప్రయత్నాలను భారతీయులు ప్రశంసలతో ముంచేస్తున్నారు.

కలకేయులు అఫ్గానిస్థాన్‌లోని ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న సమయం.. కాబుల్‌లోకి అంత త్వరగా ప్రవేశించలేర అంతా అనుకున్నారు..కాని.. ఆ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచివెళ్లిపోవటంతో భద్రతా బలగాలూ కనిపించకండా పోయాయి. దీంతో ఆగస్టు 14 రాత్రికే తాలిబన్లు కాబుల్‌లోకి ప్రవేశించగలిగారు. సమాచారం తెలియగానే అక్కడి భారత రాయబార కార్యాలయ సిబ్బంది అందరూ వచ్చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇలా వారిని భారత్ తీసుకొచ్చేందుకు వేగంగా పనులు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో మన జవాన్లు చేసిన సాహసం అంతా ఇంతా కాదు.

ఇవి కూడా చదవండి:  Success Story: మేడపై మల్లె పూల సాగు.. లక్షల్లో సంపాదన.. లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ విజయ గాథ..

Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..