Traffic Rules: ‘ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే తప్పేం కాదు’.. కానీ షరతులు వర్తిస్తాయంటున్న కేంద్ర మంత్రి..

Driving with Phone Call: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే చట్టరిత్యా నేరం అనే విషయం తెలిసిందే. డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే ఇక అంతే సంగతులు.

Traffic Rules: ‘ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే తప్పేం కాదు’.. కానీ షరతులు వర్తిస్తాయంటున్న కేంద్ర మంత్రి..

Updated on: Feb 13, 2022 | 1:15 PM

Driving with Phone Call: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే చట్టరిత్యా నేరం అనే విషయం తెలిసిందే. డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే ఇక అంతే సంగతులు. భారీ జరిమానాలతో జేబులు ఖాళీ అవడం ఖాయం. అయితే, ఇదే అంశంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్స్ చేశారు. ఫోన్ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదని ప్రకటించారు. అయితే, కండీషన్స్ అప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చారు కేంద్ర మంత్రి. ఇటీవల లోక్‌సభలో ప్రసంగించిన మంత్రి నితిన్ గడ్కరీ.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే నేరం కాదని, త్వరలో ఈ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. అయితే షరతులు వర్తిస్తాయని చెప్పారు. మొబైల్ ఫోన్ ను చేతిలో పట్టుకోకుండా ఇయర్ ఫోన్స్ ద్వారా ఫోన్ మాట్లాడితే దాన్ని నేరంగా పరిగణించకూడదన్నారు కేంద్ర మంత్రి. గడ్కరీ కామెంట్స్‌కు సంబంధించి నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

పార్లమెంట్‌లో కేంద్రమంత్రి గడ్కరీ ఏమన్నారంటే.. ‘‘ఇకపై కారు, ఇతర వాహనాలు నడిపే వారు ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ డివైజ్‌లను ఉపయోగించి ఫోన్లు మాట్లాడితే నేరంగా పరిగణించలేం. అయితే, దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. డ్రైవింగ్ చేసేప్పుడు ఫోన్ కార్లో గానీ, చేతిలో గానీ ఉండకుండా డ్రైవర్ జేబులో ఉండాలి. దీనికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేయకూడదు. ఒకవేళ ఎవరైనా జరిమానా వేస్తే దాన్ని కోర్టులో సవాల్ చేయొచ్చు. అయితే, మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఫోన్ మాట్లాడితే మాత్రం ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించవచ్చు.’’ అని అన్నారు. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం.

Also read:

Bollywood to Tollywood: టాలీవుడ్ బాట పట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే..

Andhra Pradesh: ముస్లింలకు ఇచ్చి కాపులకు ఎందుకివ్వరు.. రిజర్వేషన్లపై సోము వీర్రాజు సంచలన కామెంట్స్..

Bird Walk Festival: కవ్వాల్ జంగిల్‌లో అందాల పక్షుల పండుగ.. పులుల అడ్డాలో పక్షి ప్రేమికుల సందడి