ISRO: అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న అగ్రదేశాలతో పోలిస్తే.. భారత్ సీనియారిటీ తక్కువ. అయినా ప్రపంచంలో ఇపుడు ఏ దేశం అంతరిక్షంలోకి తమ ఉపగ్రహాలను పంపాలన్నా ముందుగా గుర్తుకు వచ్చేది భారత్. ఇంకా చెప్పాలంటే నాసా లాంటి అంతరిక్ష పరిశోధనల్లో టాప్‌లో ఉంది అమెరికా. అలాంటి అమెరికాకు చెందిన శాటిలైట్లను సైతం ఇస్రో అంతరిక్షంలోకి పంపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకప్పుడు మన దేశ అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధార పడ్డ పరిస్థితి నుంచి ఇపుడు మనం ఇతర దేశాల ఉపగ్రహాలను సైతం నింగిలోకి పంపగలిగే స్థాయికి చేరుకున్నాం. అందుకు ఇస్రో శ్రమ ఎంతో ఉంది. తాజాగా మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్ .3 రాకెట్ ప్రయోగం విజయవంతం తర్వాత పదిహేను రోజులకే ఇస్రో శాస్త్రవేత్తలు సింగపూర్ దేశానికి చెందిన 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. DS-SAR అనే సాటిలైట్ తోపాటు మరో ఆరు ఉపగ్రహాలను పంపేందుకు PSLV.. సి56 కమర్షియల్ రాకెట్ ప్రయోగం ఆదివారం ఉదయం 6.31 గంటలకు జరగనుంది. ఇందుకోసం కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది.
సింగపూర్ దేశానికి చెందిన డీఎస్ -ఎస్ ఏ ర్ అనే 351.9 కేజీలు బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం ఈ ప్రయోగంలో ప్రధానమైనది. అదేవిధంగా దీనితో పాటు 23. 58 కేజీలు బరువు ఉన్న ఆర్కేడ్ సాటిలైట్ మరియు 23 కేజీలు బరువు ఉన్న వెలాక్ -ఎ ఎమ్ సాటిలైట్ మరియు 12.8 కేజీలు బరువు ఉన్న ఆర్బు12 స్పైడర్ ఉపగ్రహాలతో పాటు మరో మూడు నానో ఉపగ్రహాలు ,గెలుసియా-2 ,స్కూప్-2, మరియు నులియన్ అనే నానో ఉపగ్రహాలను ఇందులో అమర్చి ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి- సి 56 రాకెట్ ప్రయోగం ద్వారా పూర్తి విదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన PSLV. C 56 రాకెట్ ప్రయోగం ద్వారా విదేశీ ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ లోకి విజయవంతం గా పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే షార్ లో రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు పూర్తి చేశారు.