Covid 19 End in India: భారతీయులకు శుభవార్త.. దేశంలో కోవిడ్19 కథ ముగిసినట్లేనా!?..

Covid 19 End in India: భారతదేశంలో కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిందా? రానున్న రోజుల్లో కోవిడ్ పూర్తిగా అంతమైపోనుందా? రోజు రోజుకు..

Covid 19 End in India: భారతీయులకు శుభవార్త.. దేశంలో కోవిడ్19 కథ ముగిసినట్లేనా!?..
Covid 19
Follow us

|

Updated on: May 28, 2022 | 10:03 PM

Covid 19 End in India: భారతదేశంలో కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిందా? రానున్న రోజుల్లో కోవిడ్ పూర్తిగా అంతమైపోనుందా? రోజు రోజుకు తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్యే అందుకు సంకేతమా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. రానున్న రోజుల్లో భారత్‌లో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గనుందని చెబుతున్నారు వైద్య పరిశోధకులు.

భాతరదేశంలో ఇవాళ 2,685 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,31,50,215కి చేరుకుంది. అదే సమయంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 16,308కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇవాళ 33 మరణాలు నమోదు అయ్యాయి. దాంతో కోవిడ్ మరణాల సంఖ్య 5,24,572కి చేరుకుంది. అయితే, డేటాను పరిశీలిస్తే.. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. మే 2020 స్థాయిల కంటే ప్రస్తుతం చాలా తక్కువగా ఉండటం వారి విశ్లేషణలకు ఆధారంగా పేర్కొంటున్నారు. దీని ఆధారంగానే దేశంలో కోవిడ్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందని అంచనాకు వస్తున్నారు.

గణనీయంగా తగ్గిన మరణాల రేటు.. తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు గతంతో పోలిస్తే చాలా తక్కువ తీవ్రత కలిగినవని నివేదికలు చెబుతున్నాయి. ఆ కారణంగా మరణాల శాతం భారీగా తగ్గింది. వాక్సినేషన్ కవరేజీ పెరగడంతో భారతదేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పట్టింది. దేశంలో ప్రతి సంవత్సరం కోవిడ్ మరణాలలో స్థిరమైన క్షీణత కనిపిస్తోంది. మే 2020లో కోవిడ్ మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు దేశంలో మరణాల రేటు 2.73 శాతంగా ఉంది. మే 2021లో ఇది 1.33 శాతానికి పడిపోయింది. మే 2022లో 1.04 శాతానికి తగ్గిందని భారత వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి.

మొదటి స్థానంలో ఢిల్లీ.. కరోనా కేసులు, మరణాల విషయంలో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచినట్లు నివేదికలు చెబుతున్నాయి. మే 1వ తేదీ నుంచి మే 25 వరకు కోవిడ్ కేసుల జాబితాను పరిశీలిస్తే ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ నెలలో ఢిల్లీలో 21,589 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇది దేశంలోనే అత్యధికం. హర్యానా 8,999 కేసులతో రాజధాని ఢిల్లీ తరువాతి స్థానంలో నిలిచింది. ఆ తరువాత మహారాష్ట్ర (6,086), ఉత్తరప్రదేశ్ (4,949), కర్ణాటక (3,356), రాజస్థాన్ (1,688), పశ్చిమ బెంగాల్ (931), మిజోరం (786), పంజాబ్ (646), ఒడిశా (344), హిమాచల్ ప్రదేశ్ (209) దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ COVID-19 కేసులు ఉన్న రాష్ట్రాలుగా నిలిచాయి.

మే 1, 2022 నుండి మే 25, 2022 వరకు అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీ అత్యధిక సంఖ్యలో COVID-19 మరణాలు నమోదు అయ్యాయి. ఢిల్లీ 32 మరణాలు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర (14), ఉత్తరప్రదేశ్ (12), కర్ణాటక (5), పంజాబ్ (3), రాజస్థాన్ (3), హిమాచల్ ప్రదేశ్ (2), హర్యానా (2), మిజోరం (2), ఒడిశా (2), పశ్చిమ బెంగాల్ ( 2) ఈ నెలలో అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రాలుగా లెక్కల్లోకెక్కాయి.

అయితే, ప్రపంచ దేశాలతో పోల్చి చూసినా.. కరోనా ప్రభావం భారత్‌లో చాలా తక్కువగా ఉంది. రష్యా, స్పెయిన్, యూకే వంటి దేశాలలో మరణాల రేటు అధికంగా ఉంది. భారత్‌లో మాత్రం చాలా తక్కువగా ఉంది. మరికొన్ని దేశాలలో కరోనా మహమ్మారి ఇప్పటికీ ఎక్కువగానే ఉంది.

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..