IRCTC: వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టిందా..? అయితే వర్క్ ఫ్రమ్ హోటల్ ఉందిగా.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్

|

May 13, 2021 | 12:26 PM

IRCTC work from hotel: కరోనావైరస్ అంతటా విలయతాండవం చేస్తోంది. దాదాపు ఎడాదిన్నర నుంచి పలు రంగాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఇప్పటికీ పలు సంస్థలు

IRCTC: వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టిందా..? అయితే వర్క్ ఫ్రమ్ హోటల్ ఉందిగా.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Salary Hike
Follow us on

IRCTC work from hotel: కరోనావైరస్ అంతటా విలయతాండవం చేస్తోంది. దాదాపు ఎడాదిన్నర నుంచి పలు రంగాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఇప్పటికీ పలు సంస్థలు నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నాయి. అయితే.. కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్‌ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు.. అన్నీ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీల ఉద్యోగులు గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే రోజూ ఇంట్లోనే ఉంటూ, ఉద్యోగం చేస్తూ.. కాలు బయటకు పెట్టకుండా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్.. అంటే చాలు బోర్.. అంటూ పనిపై నిరాశ, నిస్పృహను వెళ్లగక్కుతున్నారు. ఈ సమయంలోనే సరదాగా ఎక్కడికైనా వెళ్దామంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయపెడుతోంది.

ఇలాంటి తరుణంలో.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొడితే.. ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ ఉందంటూ ప్యాకేజీని సైతం ప్రకటించింది. ఈ కాన్సెప్ట్ కొత్తేమీ కాదు. గతేడాది కూడా పాపులర్ అయింది. ఇప్పుడు ఐఆర్‍సీటీసీ టూరిజం ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. కేరళలోని హోటళ్లలో కొన్ని రోజుల పాటు ఉంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకునేందుకు ప్యాకేజీని ప్రకటించింది.

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ప్రకటించిన వివరాల ప్రకారం.. ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,126. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధరగా ప్రకటించింది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి ఐదు రాత్రులు హోటల్‌లో బస, మూడు పూటలా భోజనం, రెండు సార్లు టీ లేదా కాఫీ, వైఫై సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ఎలాంటి సైట్ సీయింగ్ ఉండదు. ఈ ప్యాకేజీలో కేవలం హోటల్‌లో ఉంటూ పని చేసుకోవాల్సి ఉంటుంది. ఖాళీ సమయంలో హోటల్‍లోని వాతావరణాన్ని మాత్రమే ఎంజాయ్ చేయాలి. ప్రస్తుతం కేరళలోని హోటళ్లలో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

కేరళలోని మున్నార్, అలెప్పీ, వాయనాడ్, తెక్కడి, కొచ్చిన్, కుమారకోమ్, కోవలం లాంటి ప్రాంతాల్లోని హోటళ్లల్లో ఈ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ గడువు ఐదు రోజులు మాత్రమే. ఆ తర్వాత మరిన్ని రోజులు పొడిగించుకోవచ్చు. దానికి తగినట్లుగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే… కేరళనే కాకుండా త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్యాకేజీలు అందించనున్నట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Also Read:

Ramadan 2021: రేపే రంజాన్.. నేటితో ముగియనున్న ఉపవాసాలు..నేడు సౌదీలో పర్వదినం..

డయాబెటీస్ ఉన్నవారు పొరపాటున కూడా ఈ పండ్లు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..