IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తత్కాల్ సేవల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక యాప్

|

Mar 24, 2022 | 1:53 PM

రైల్వే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ(IRCTC) నూతన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం కొత్తగా కన్ఫామ్ టికెట్ (Confirm tkt) పేరుతో యాప్ లాంఛ్ చేసింది. ఈ యాప్ ద్వారా తత్కాల్ ట్రైన్...

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తత్కాల్ సేవల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక యాప్
Tatkal Tickets
Follow us on

రైల్వే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ(IRCTC) నూతన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం కొత్తగా కన్ఫామ్ టికెట్ (Confirm tkt) పేరుతో యాప్ లాంఛ్ చేసింది. ఈ యాప్ ద్వారా తత్కాల్ ట్రైన్ టికెట్లను బుకింగ్(Booking) చేసుకోవచ్చని వెల్లడించింది. తత్కాల్ టికెట్లను రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు మాత్రమే బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైల్వే ప్రయాణికులు కన్ఫామ్ టికెట్ యాప్ ద్వారా తత్కాల్ రైలు టికెట్లు బుక్ చేయవచ్చు. ప్రయాణికులు వ్యక్తిగత వివరాలను యాప్ లేదా వెబ్‌సైట్‌లో ముందుగానే అప్‌డేట్ చేయాలి. దీని వల్ల తత్కాల్ టికెట్లు బుక్ చేసేప్పుడు సమయం ఆదా అవుతుంది. వారికి తత్కాల్ టికెట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అత్యవసరంగా ప్రయాణాలు చేయాలనుకునేవారు, చివరి నిమిషంలో ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నవారికి తత్కాల్ రైలు టికెట్స్ ఉపయోగపడతాయి. ఏసీ రైళ్లల్లో తత్కాల్ టికెట్ల బుకింగ్ ముందు రోజు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ రైళ్లల్లో తత్కాల్ టికెట్లకు ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.

తత్కాల్ టికెట్లు బుక్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, జన శతాబ్ధి, ఇంటర్‌సిటీ, సూపర్ ఫాస్ట్ రైళ్లు, డబుల్ డెక్కర్ రైళ్లు, సంపర్క్ క్రాంతి, మెయిల్ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతో పాటు అన్ని రైళ్లల్లో తత్కాల్ టికెట్స్ బుక్ చేయవచ్చు. కన్ఫామ్ టికెట్ యాప్‌లో తత్కాల్ ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే.. ప్రయాణికులు ముందుగా https://www.confirmtkt.com/ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనుకుంటున్నారో వివరాలు ఎంటర్ చేయాలి. ఏ రోజున ప్రయాణించాలనుకుంటున్నారో తేదీ సెలెక్ట్ చేయాలి. రైళ్ల జాబితా నుంచి మీరు బుక్ చేయాలనుకుంటున్న ట్రైన్ సెలెక్ట్ చేయాలి.

స్లీపర్, థర్డ్ ఏసీ అనే క్లాస్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత బోర్డింగ్ పాయింట్ ఎంచుకోవాలి. ప్రయాణికుల వివరాలు, బెర్త్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేయాలి. కాంటాక్ట్ వివరాలు, ఈ – మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. ఇతర ప్రిఫరెన్సులు సెలెక్ట్ చేయాలి. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయాలి. ఐఆర్‌సీటీసీ లాగిన్ వివరాలు ఎంటర్ చేసి బుకింగ్ పూర్తి చేయాలి.

Also Read

Minister Peddireddy: గ్రామీణ పేదలకు ఉపాధి హమీ కల్పించడంలో ఏపీ అగ్రస్థానమన్న మంత్రి పెద్దిరెడ్డి.. ఇప్పటికి ఎంత వ్యయమైందంటే?

Imran Khan: రిటైర్ట్‌హర్ట్‌ అయ్యే ప్రసక్తే లేదు.. లాస్ట్‌ బాల్‌ వరకు ఆడతా.. విక్టరీ సాధిస్తా: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌

Dinner Party: ఫ్రెండేకదా అని ఇంటికి డిన్నర్‌కి వెళితే.. ఊహించాను షాకే ఇచ్చింది..? వైరల్ అవుతున్న వీడియో