ఆత్మపరిశీలన అవసరమే ! పార్టీని సక్రమ పంథాలో నడిపిద్దాం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ పిలుపు

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.

  • Publish Date - 3:31 pm, Mon, 10 May 21 Edited By: Phani CH
ఆత్మపరిశీలన అవసరమే ! పార్టీని సక్రమ పంథాలో నడిపిద్దాం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ పిలుపు
Sonia Gandhi

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. హౌస్ (పార్టీ) ని తిరిగి ఆర్డర్ (సక్రమ పంథా) లో పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. ఢిల్లీలో సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ మధ్య 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ప్రతివారూ ఆత్మపరిశీలన చేసుకోవాలని, సమీక్షించుకోవాలని సూచించారు., ఎలెక్షన్స్ లో మనం ఆశించినదానికన్నా చాలా దిగువ స్థాయిలో మన పార్టీ పర్ఫార్మెన్స్ ఉందని, ఈ ఫలితాలు పార్టీ..సక్రమ పంథాలో కొనసాగాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాయని ఆమె చెప్పారు. ఈ వైఫల్యాలపై సమీక్షకు ఓ చిన్న బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని సోనియా తెలిపారు. ఈ గ్రూప్ త్వరలో తన నివేదికను సమర్పిస్తుందన్నారు. కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాలను మన పార్టీ ఎందుకు పడగొట్టలేకపోయిందో విశ్లేషించుకోవలసిన అవసరం ఉందని, బెంగాల్ లో అయితే పూర్తిగా చతికిలపడిపోయామని ఆమె పేర్కొన్నారు. తమిళనాడులో మాత్రం మన ఉనికిని చాటుకోగలిగామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మనకు గుణపాఠం నేర్పాయని, ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి.. సరైన అంచనాలతో ముందుకు వెళదామని సోనియా సూచించారు. కాగా జూన్ లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సి ఉందని, అంటూ ఆమె ఇందుకు సంబంధించిన సన్నాహక ప్రక్రియను సీనియర్ నేతలకు అప్పజెబుతున్నామన్నారు.

అటు దేశంలో కోవిడ్ పరిస్థితిని మోదీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని సోనియా ఆరోపించారు. ఆక్సిజన్, వ్యాక్సిన్, కోవిడ్ మందుల కొరతను ఈ ప్రభుత్వం తీర్చలేకపోతోందన్నారు. ఈ పరభుత్వానికి ఓ పాలసీ అంటూ లేదని, ఈ సర్కార్ విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవడంలేదని ఆమె విమర్శించారు. విదేశాల నుంచి అందుతున్న సాయాన్ని కూడా మనం సరిగా వినియోగించు=కోలేక పోతున్నాం అని ఆమె విచారం వ్యక్తం చేశారు. కోవిడ్ పరిస్థితిపై తాము చేస్తున్న సూచనలను మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆమె అన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Bill Gates and Melinda Divorce: బిల్ గేట్స్ దంపతుల విడాకుల నిర్ణయం…ఆసక్తికర విషయాలు వెల్లడి

TNR Last Words: క‌రోనా గురించి ఇంత తెలిసిన వ్య‌క్తి ఎలా మ‌ర‌ణించాడు.. క‌న్నీరు పెట్టిస్తోన్న టీఎన్ఆర్ చివ‌రి మాట‌లు..