International Childhood Cancer Day 2022: పిల్లల్లో వచ్చే 50శాతం క్యాన్సర్లు అవే.. తేల్చిచెప్పిన ICMR

|

Feb 16, 2022 | 6:40 AM

2012-2019 మధ్యకాలంలో నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ కింద 96 ఆసుపత్రుల నుంచి నమోదైన మొత్తం 13,32,207 క్యాన్సర్ కేసుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. వీటిలో, 6,10,084 కేసులను విశ్లేషించారు.

International Childhood Cancer Day 2022: పిల్లల్లో వచ్చే 50శాతం క్యాన్సర్లు అవే.. తేల్చిచెప్పిన ICMR
International Childhood Cancer Day 2022
Follow us on

Indian Council Of Medical Research: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) రూపొందించిన క్లినికోపాథలాజికల్ ప్రొఫైల్ ఆఫ్ క్యాన్సర్స్ 2021 నివేదిక భారతదేశంలో చిన్నారుల్లో క్యాన్సర్(Cancer) కేసులు పెరుగుతున్నాయని సూచించింది. 2012-2019 మధ్యకాలంలో నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ కింద 96 ఆసుపత్రుల నుంచి నమోదైన మొత్తం 13,32,207 క్యాన్సర్ కేసుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. వీటిలో, 6,10,084 కేసులను విశ్లేషించారు. ఏడేళ్ల కాలంలో 0-14 సంవత్సరాల వయస్సు గల వారిలో క్యాన్సర్‌లు దాదాపు 8 శాతం కేసులను కలిగి ఉన్నాయని చూపిస్తుంది. 2012, 2014 మధ్య, 15 ఏళ్లలోపు వారి వాటా 5 శాతం కంటే తక్కువగా ఉంది.

న్యూ ఢిల్లీలోని ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ షుచిన్ బజాజ్ న్యూస్ 9తో మాట్లాడుతూ పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌లో అత్యంత సాధారణ రకం లుకేమియా, రక్త క్యాన్సర్. లుకేమియా ఎముక మజ్జలో ప్రారంభమవుతుంది. మన ఎముకలలోని రక్త కణాలు తయారయ్యే స్పాంజి పదార్ధం. మెదడు, మూత్రపిండాలు, కండరాలు లేదా ఎముక వంటి శరీరమంతా ఇలాంటి కణితులు ఏర్పడవచ్చు.

నివేదిక ప్రకారం, భారతదేశంలోని 0-14 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో క్యాన్సర్లలో దాదాపు సగం లుకేమియాకు సంబంధించినవే కావడం గమనార్హం. అబ్బాయిలలో లింఫోమా క్యాన్సర్ వస్తుంగా, ప్రాణాంతక ఎముకల్లో ఏర్పడే కణితులు బాలికలలో విస్తృతంగా తేలినట్లు జాబితా పరేర్కొంది. అలాగే, దాదాపు 70 శాతం కిడ్నీ క్యాన్సర్ కేసులు 0-4 సంవత్సరాల వయస్సులో నమోదయ్యాయి. మెదడు, నాడీ వ్యవస్థ క్యాన్సర్లలో మూడింట ఒక వంతు మంది 5-9 సంవత్సరాల వయస్సు పిల్లల్లో వెలుగు చూశాయి. మొత్తంగా అన్ని వయసుల వారికి, పొగాకు వాడకంతో సంబంధం ఉన్న క్యాన్సర్‌లు పురుషులలో 48.7 శాతంకాగా, స్త్రీలలో 16.5 శాతం కేసులను కలిగి ఉన్నాయి. తల, మెడ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్లు అన్ని కేసులలో మూడింట ఒక వంతుగా నిలిచాయి. గత సంవత్సరం, దేశంలో దాదాపు 14 లక్షల కొత్త కేసులు కనుగొన్నారు. ఇది 2018 గణాంకాలతో పోలిస్తే 16 శాతం పెరిగడం ఆందోళన కలిగిస్తోంది.

చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్ కారణాలు చాలా వరకు తెలియవు. వీరిలో అకస్మాత్తుగా సంభవించవచ్చు. ఎటువంటి ప్రారంభ లక్షణాలు లేకుండానే ఇది వచ్చే అవకాశం ఉంది. శారీరక పరీక్ష సమయంలో మాత్రమే వీటిని గుర్తించవచ్చే. “మీ పిల్లలలో ఏదో అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే, సరిగ్గా ఎదగకపోవటం, బొడ్డు విపరీతంగా మారడం, మూత్రంలో రక్తం కనిపించడం వంటివి కనిపిస్తే, మీ బిడ్డను డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి” అని డాక్టర్ బజాజ్ చెప్పారు.

చికిత్సలో ఆధునిక పద్ధతులు.. ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సకు కీమోథెరపీ నుంచి ఎన్నో ఔషధాల వరకు వచ్చాయి. ఉదాహరణకు, 30 సంవత్సరాల క్రితం చిన్ననాటి లుకేమియా చికిత్సలో తరచుగా మెదడుకు రేడియేషన్ చేసేవారు. కానీ, రేడియేషన్ వల్ల జీవితంలో తర్వాతి కాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం కీమోథెరపీకి మెరుగుదలలతో, ల్యుకేమియాతోపాటు కొన్ని ఇతర రకాల క్యాన్సర్‌లతో బాధపడుతున్న పిల్లలకు, ఆంకాలజిస్ట్‌లు రేడియేషన్‌లెస్‌ను ఉపయోగిస్తున్నారు. “ఆలోచించడం నేర్చుకోవడంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలు, తరువాత మెదడు కణితులు అభివృద్ధి చెందే ప్రమాదం ఉన్నందున ఇది మంచి మార్పు” అని డాక్టర్ బజాజ్ జోడించారు.

Also Read: Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

KCR POLITICS: కేసీఆర్ రాజకీయానికి అనూహ్య స్పందన.. త్వరలో జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు.. తెరమీదికి మరో కూటమి?