ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద ఆడుకుంటున్న రెండు కుక్కపిల్లలను గుర్తుతెలియని వ్యక్తి బైకుతో తొక్కి చంపేశాడు. ఈ ఘటన ఆగ్రాలో జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగ్రాలోని సికందరా ప్రాంతంలో జూన్ 14న రాత్రి 10.30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై ఆడుకుంటున్న ఓ కుక్క పిల్ల మీదకు బైకు ఎక్కించాడు. ఆ కుక్కపిల్ల బాధతో గిలగిలాకొట్టుకుంటుంటే.. కుక్కపిల్ల తల్లి, మిగతా కుక్క పిల్లలు చుట్టూ చేరాయి. ఈ సమయంలోని అదే బైకర్ మళ్లీ వెనక్కి యమా స్పీడ్‌గా వచ్చి.. మరో కుక్క పిల్ల మీద నుంచి బైక్ ఎక్కిస్తాడు.
ఈ ఘటన అంతా కూడా రోడ్డు ప్రక్కనే ఉన్న ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డు అయింది. అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గుర్తుతెలియని వ్యక్తిపై పోలీసులు జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?
పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!