కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో.. 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (జేఐవో) గ్రేడ్-2/ టెక్నికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యా సంస్థ నుంచి పోస్టును బట్టి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఫిజిక్స్/ మేథమెటిక్స్ సబ్జెక్టులుగా ఉండాలి) లేదా బీసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు/ ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు జూన్ 23, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ రూ.500లు అప్లికేషన్ ఫీజును జూన్ 27వ తేదీలోపు చెల్లించవల్సి ఉంటుంది. 100 మార్కులకు రాత పరీక్ష, 30 మార్కులకు స్కిల్ టెస్ట్, 20 మార్కులకు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎమినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికై వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.