అర్థరాత్రి ఇంట్లో అనుమానాస్పదంగా మంటలు.. రెండేళ్ల చిన్నారి సజీవ దహనం.. తల్లి పరిస్థితి..

ఈ ప్రమాదంలో హరీశ్ వర్మ రెండేళ్ల కూతురు పూనమ్ సజీవ దహనం కాగా, అతని భార్య గీత(35) తీవ్రంగా కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. గీత పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అర్థరాత్రి ఇంట్లో అనుమానాస్పదంగా మంటలు.. రెండేళ్ల చిన్నారి సజీవ దహనం.. తల్లి పరిస్థితి..
Fire Accident

Updated on: Apr 21, 2025 | 3:50 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సూల్తాన్‌పూర్‌ జిల్లా పురే లాలా మజ్రా సోన్‌వర్సా గ్రామంలోని హరీష్ వర్మ అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హరీశ్ వర్మ రెండేళ్ల కూతురు పూనమ్ సజీవ దహనం కాగా, అతని భార్య గీత(35) తీవ్రంగా కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. గీత పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..