న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ.. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పటల్‌పాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ కూలింది. దీంతో అక్కడే ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు. .ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.