Kolkata Airport: కోల్‌కతా ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. మాస్క్ వేసుకోనందుకు విమానం నుంచి అతడిని దింపి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఇండిగో 6 ఇ 938 బెంగళూరు-కోల్‌కతా విమానంలో ఓ ప్రయాణికుడు టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ఎయిర్ పోర్టుకు వచ్చిన అతడు మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వహించాడు. పదే పదే మాస్క్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీంతో విమానయాన అధికారులు అతడిని హెచ్చిరంచారు. అయినా పట్టించుకోకపోవడంతో అతడిని సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు.
ఇలాంటి ఘటనలు ఈ వారంలో రెండు మూడు జరిగాయి. గోవా ఎయిర్ పో ర్ట్ లో కూడా ఇద్దరు ప్రయాణికులు కొ విడ్ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఎయిర్ పోర్టు అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో కూడా నలుగురు ప్రయాణికులు పదే పదే హెచ్చరించినా బేఖాతరు చేసిందుకు నలుగురిని డీబోర్డ్ చేశారు. కరోనా వల్ల ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరని అందరికి తెలిసిన విషయమే. కాగా దేశంలో కొత్తగా 40,953 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని, 23,653 రికవరీలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసుల చేరికతో దేశంలో మొత్తం కేసులు 1,15,55,284 కు చేరుకున్నాయి, వీటిలో 2,88,394 క్రియాశీల కేసులు, 1,11,07,332 రికవరీలు మరియు 1,59,558 మరణాలు ఉన్నాయని వివరించింది.