USA on India: భారత దేశ భద్రతా ప్రయోజనాలు చాలా ముఖ్యం.. స్పష్టం చేసిన అమెరికా

|

Oct 06, 2021 | 9:25 PM

భారత దేశ భద్రతా ప్రయోజనాలు తమకు చాలా ముఖ్యమని, భారత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తామని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ షెర్మన్ అన్నారు.

USA on India: భారత దేశ భద్రతా ప్రయోజనాలు చాలా ముఖ్యం.. స్పష్టం చేసిన అమెరికా
Harsh Vardhan Shringla Meet Wendy Sherman
Follow us on

భారత దేశ భద్రతా ప్రయోజనాలు తమకు చాలా ముఖ్యమని, భారత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తామని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ షెర్మన్ అన్నారు. మూడు రోజుల పర్యటనకు వచ్చిన షెర్మన్ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లాతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు చెందిన అధికారుల బృందం సమావేశమైన కీలక అంశాలపై చర్చలు జరిపారు. వెండీ షెర్మన్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత్, అమెరికాలది ఒకే మనసు, ఒకే వైఖరి అని షర్మన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే ఉగ్రవాదంపై భారత దేశ ఆందోళనను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. భారత ప్రయోజనాలకు ఎవిధంగా భంగం కలిగించమన్నారు.

ఇదిలావుంటే, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాన్ని తాలిబన్లు ఉగ్రవాదులు స్వాధీనం చేసుకుని, తమ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వానికి భారత్, అమెరికా రెండు దేశాలు ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ఆ దేశంలో పరిస్థితులను పరిశీలిస్తూ, వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. మరోవైపు ఆ దేశ ప్రజలకు అని విధాలుగా సహకరిస్తామని తెలిపాయి.

ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ శృంగ్లాతో జరిగిన సమావేశం అనంతరం షెర్మన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత్, అమెరికా ఒకే విధమైన షరతులను విధించాయన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోయే సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, ఆఫ్ఘన్ గడ్డ ఉగ్రవాదులకు అడ్డాగా మారకుండా నిరోధించడం, మానవ హక్కులను గౌరవించడం, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్ళిపోవాలనుకునేవారు సురక్షితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించడం వంటి షరతులను విధించినట్లు తెలిపారు. భారత దేశ భద్రతా ప్రయోజనాలు తమకు చాలా ముఖ్యమని, భారత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తామని చెప్పారు. “తాలిబాన్ల పాలనను ఏ దేశం గుర్తించదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ని కలిసిన తర్వాత చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాద నిరోధకానికి ‘ఓవర్-ది-హోరిజోన్’ కోసం అమెరికా ఒక బలమైన కార్యక్రమాన్ని రూపొందిస్తుందని షెర్మాన్ హామీ ఇచ్చారు.


Read Also… Big News Big Debate:’మా’ ఎన్నికల్లో జీవిత రాజశేఖర్ డబుల్ గేమ్ అడుతున్నారా?