Human Development Index… మానవాభివృద్ధి సూచీలో మనమెక్కడ..? నివేదికను విడుదల చేసిన ఐరాస…

| Edited By:

Dec 17, 2020 | 10:56 AM

మానవాభివృద్ధి సూచీలో (హెచ్‌డీఐ)లో భారత్‌ గతేడాది కన్నా ఒక స్థానం దిగజారింది. మొత్తం 189 దేశాల జాబితాలో 131 స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది.

Human Development Index... మానవాభివృద్ధి సూచీలో మనమెక్కడ..? నివేదికను విడుదల చేసిన ఐరాస...
Follow us on

మానవాభివృద్ధి సూచీలో (హెచ్‌డీఐ)లో భారత్‌ గతేడాది కన్నా ఒక స్థానం దిగజారింది. మొత్తం 189 దేశాల జాబితాలో 131 స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. హెచ్‌డీఐ విలువను 0-1 మధ్య కొలుస్తారు. ఇందులో భారత్‌ విలువ 0.645 అని నివేదిక పేర్కొన్నది. 2019 సంవత్సరంలో భారతీయుల సగటు ఆయుర్దాయం 69.7 ఏండ్లు అని తెలిపింది. ఈ విషయంలో బంగ్లాదేశ్‌ భారత్‌ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నది. బంగ్లాదేశీల ఆయుర్దాయం 72.6 సంవత్సరాలు.

 

ఇండియాలో పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సూచీలో నార్వే మొదటిస్థానంలో ఉండగా తర్వాత ఐర్లాండ్‌, స్విట్జర్లాండ్‌, హాంకాంగ్‌, ఐస్‌ల్యాండ్‌ ఉన్నాయి. నైగర్‌ ఈ జాబితాలో అట్టడుగున ఉంది. యూఎన్‌డీపీ ఈసారి కర్బన ఉద్గారాలకు సంబంధించిన నివేదికను కూడా ప్రయోగాత్మకంగా వెల్లడించింది. స్థాపిత సౌర విద్యుత్తు సామర్థ్యం(ఇన్‌స్టాల్డ్‌ సోలార్‌ కెపాసిటీ)లో భారత్‌ 5వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లోని బలహీనతలు, అసమానతలను కరోనా ఎత్తి చూపిందని యూఎన్‌డీపీ పేర్కొన్నది. మానవాభివృద్ధి సూచీని మొట్టమొదట పాక్‌ ఆర్థిక వేత్త మహబూబ్‌ ఉల్‌ హక్‌, అమర్త్యసేన్‌ సంయుక్తంగా 1990లో విడుదల చేశారు.

దేశాల ర్యాంకులు

భారత్‌ 131

చైనా 85

అమెరికా 17

భూటాన్‌ 129

బంగ్లాదేశ్‌ 133

నేపాల్‌ 142

పాకిస్థాన్‌ 154

భారతీయుల సగటు ఆదాయం (ఏడాదికి)

2018- రూ.5,02,933 (6829 డాలర్లు)

2019- రూ.4,92,033 (6681 డాలర్లు)