మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలు నిర్వహించాలని కమిటీ తీర్మానం.. డోలాయమానంలో తమిళనాడు సర్కారు.!
తమిళనాడులో జల్లికట్టు పోటీలకు సంబంధించి జల్లికట్టు కమిటీ ఇవాళ సమావేశమైంది. జనవరి 15 నుండి 17 వరకు తమిళనాట జరుగబోయే ఈ పోటీలకు సంబంధించి..
తమిళనాడులో జల్లికట్టు పోటీలకు సంబంధించి జల్లికట్టు కమిటీ ఇవాళ సమావేశమైంది. జనవరి 15 నుండి 17 వరకు తమిళనాట జరుగబోయే ఈ పోటీలకు సంబంధించి పలు తీర్మానాలు చేసింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దక్షిణ తమిళనాడులోని మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలను నిర్వహించాలని తీర్మానం చేశారు. కరోనా నిబంధనలు సడలించి జల్లికట్టు పోటీలకు అనుమతివ్వాలని తమిళనాడు సర్కార్ కి విజ్ఞప్తి చేశారు. జనవరి 15 నుండి ప్రభుత్వం ఇచ్చే నిబంధనల ప్రకారం జల్లికట్టు పోటీలను నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.
ఇలాఉంటే, కమిటీ తీర్మానాలు తెలంగాణ ప్రభుత్వానికి సంకటంగా మారేపరిస్థితి కనిపిస్తోంది. మధురై జల్లికట్టు నిర్వహణ కమిటీకి అనుమతిస్తే మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటన్నది కొత్తగా ఉదయిస్తున్న ప్రశ్న. ఒకవేళ సర్కారు ఓకే అంటే మాత్రం, అటు, పుదుక్కోటై, సేలం తదితర ప్రాంతాల కమిటీలకు కూడా అనుమతి ఇవ్వాల్సిందే. కరోనా సమయంలో జల్లికట్టుకు అనుమతి సాధ్యమేనా అనేది ఇప్పుడు తమిళతంబీల్లో మెదులుతోన్న ప్రశ్న. పోటీల వరకు ఒకే… వీక్షకులను పోటీలకు రాకుండా కట్టడి సాధ్యమేనా.? ఒకవేళ అనుమతి ఇస్తే కంట్రోల్ చేయడం అయ్యేపనేనా? కాదని అనుమతులు ఇవ్వకుంటే.. ఎన్నికల వేళ ఇబ్బందులను దృష్టిలోపెట్టుకుని సర్కారు అడుగులు వేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా తప్పని సమస్యలు ఇప్పుడు తమిళనాడులో ఉత్పన్నమయ్యే పరిస్థితిని అక్కడి ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురించింది.