AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు ప్రయాణికులకు అలర్ట్..! లగేజీ నిబంధనల్లో మార్పులు చేసిన భారతీయ రైల్వే.. వారికి బిగ్ రిలీఫ్!

భారతీయ రైల్వేలో ప్రయాణించే వారు తాము తీసుకెళ్లే లగేజీ విషయంలో రైల్వే నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా లగేజీ రవాణా నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా దేశంలోని క్రీడాకారుల ప్రయాణ కష్టాలను తీరుస్తూ రైల్వే శాఖ ఒక శుభవార్తను అందించింది.

రైలు ప్రయాణికులకు అలర్ట్..! లగేజీ నిబంధనల్లో మార్పులు చేసిన భారతీయ రైల్వే.. వారికి బిగ్ రిలీఫ్!
Indian Railways
Balaraju Goud
|

Updated on: Jun 26, 2026 | 1:35 PM

Share

భారతీయ రైల్వేలో ప్రయాణించే వారు తాము తీసుకెళ్లే లగేజీ విషయంలో రైల్వే నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా లగేజీ రవాణా నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా దేశంలోని క్రీడాకారుల ప్రయాణ కష్టాలను తీరుస్తూ రైల్వే శాఖ ఒక శుభవార్తను అందించింది.

కొత్త సర్క్యులర్ ప్రకారం, క్రీడాకారులు తమతో పాటు పెద్ద పరిమాణంలో ఉండే ప్రామాణికం కాని, సున్నితమైన క్రీడా పరికరాలను రైళ్లలో సులభంగా రవాణా చేయవచ్చు. నిర్దేశించిన రవాణా ఛార్జీలు చెల్లించిన తర్వాత జావెలిన్‌లు వంటి పెద్ద క్రీడా పరికరాలను రైళ్లలో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ పరికరాలను రైలు లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఉంచేలా ప్రాధాన్యత ఇస్తారు. సాధారణ లగేజీకి వర్తించే బరువు పరిమితి ఈ క్రీడా పరికరాలకు వర్తించదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, అన్ని రకాల క్రీడా పరికరాలకు ఈ సడలింపు లేదు. పొడవు, సాంకేతిక కారణాల వల్ల పోల్-వాల్ట్ పోల్స్‌ను ప్యాసింజర్ కోచ్‌లలో సురక్షితంగా తీసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టి, కొత్త నిబంధనల ప్రకారం వీటి రవాణాపై నిషేధం కొనసాగుతుంది.

రైలులో ఈ వస్తువులను తీసుకెళ్తే జరిమానా!

సాధారణ ప్రయాణికులు రైలు ప్రయాణంలో కొన్ని రకాల ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడంపై రైల్వే శాఖ కఠినమైన ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయి.

నిషేధిత వస్తువుల వివరాలు:

మండే స్వభావం గల పదార్థాలు: పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను తీసుకెళ్లడం పూర్తిగా నిషిద్ధం.

పేలుడు పదార్థాలు: దీపావళి టపాసులు, గన్‌పౌడర్ వంటి వాటిపై నిషేధం ఉంది.

గ్యాస్ సిలిండర్లు: రైలు కోచ్‌లలో గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడం చట్టవిరుద్ధం.

ఆయుధాలు: ఎలాంటి అనుమతులు లేని ఆయుధాలు లేదా ఇతర ప్రమాదకరమైన వస్తువులను కలిగి ఉండటం నేరం.

ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులు తమ విలువైన వస్తువుల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదని, లేదంటే దొంగతనాలకు గురయ్యే ప్రమాదం ఉందని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రయాణానికి ముందే ఈ రూల్స్ తెలుసుకుని ప్రయాణాన్ని సురక్షితంగా మార్చుకోండి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా