Railways Minister Ashwini Vaishnaw: భారత రైల్వే పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీర్థయాత్రల కోసం రామాయణ్ యాత్ర రైళ్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొత్తగా 180 భారత్ గౌరవ్ రైళ్లను త్వరలో ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం వెల్లడించారు. ఈ రైల్వే సేవల కోసం.. నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. భారత్ గౌరవ్ రైళ్ల కోసం 3,033 బోగీలను గుర్తించామని.. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఈ రైళ్ల నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైందని.. దీనికి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. అయితే.. గుర్తించిన బోగీలను ఆధునికీకరించి, ప్రత్యేక రైళ్లను నడుపుతామని పేర్కొన్నారు. పార్కింగ్, మెయింటెనెన్స్, ఇతర సదుపాయాల విషయంలో రైల్వే సహాయపడుతుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
కాగా.. రామాయణ్ యాత్ర స్పెషల్ ట్రైన్ లోని సిబ్బంది కషాయ వస్త్రాలు ధరించడంపై వెల్లువెత్తిన నిరసనల గురించి సైతం అశ్విని వైష్ణవ్ స్పందించారు. దీని నుంచి తాము గుణపాఠం నేర్చుకున్నామని.. ఇప్పటికే డ్రెస్ కోడ్ గురించి మార్గదర్శకాలు విడుదల చేసినట్లు తెలిపారు. డిజైనింగ్, ఆహారం, వస్త్రధారణ తదితర విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని రైల్వే అధికారులకు సూచించినట్లు తెలిపారు.
Also Read: