Viral Video: వీడు అసలు మనిషే కాదు.. ఎవ్వరైనా అలా చేస్తారా..? వీడియో చూస్తే మీరూ అలానే అంటారు..

Man tries to frame innocent commuter dog: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తప్పు చేసినా.. ఒప్పు చేసినా సీసీ కెమెరా కళ్లు ఎవ్వరినీ వదిలిపెట్టవు. అలా గమనించకుండా

Viral Video: వీడు అసలు మనిషే కాదు.. ఎవ్వరైనా అలా చేస్తారా..? వీడియో చూస్తే మీరూ అలానే అంటారు..
Viral News
Follow us

|

Updated on: Nov 23, 2021 | 8:07 PM

Man tries to frame innocent commuter dog: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తప్పు చేసినా.. ఒప్పు చేసినా సీసీ కెమెరా కళ్లు ఎవ్వరినీ వదిలిపెట్టవు. అలా గమనించకుండా ఓ వ్యక్తి చేసిన తప్పు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా కొందరు శాడిస్టులా బిహేవ్‌ చేయడం చూస్తుంటాం. వాళ్లు అలా ఎందుకు చేస్తారో తెలియదు కానీ.. వాటిని చూస్తే చాలా జుగుప్సాకరంగా కూడా అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత చెండాలమైన పనిచేశాడో చూడండి. అది చూస్తే మీరు తిట్టిన తిట్టు తిట్టకుండా అతన్ని తిడతారు. టర్కీలోని ఒక వ్యక్తి ఇస్తాంబుల్‌​వెళ్లుతున్న ఒక బస్సు సీటులో కుక్క మలం ఉంచాడు. తను అలా చేయడం ఎవరూ చూడలేదు అనుకున్నాడు. కానీ ఆ ఘటన అక్కడ సీసీఫుటేజ్‌లో రికార్డు అయింది. ఆ తర్వాత బస్సు ఎక్కిన చాలా మంది అది బోజీ పనే అనుకున్నారు. బోజీ అంటే ఇస్తాంబుల్‌లో వీధి కుక్క అని అర్థం. అయితే ఇస్తాంబుల్ మునిసిపాలిటీ ప్రతినిధి మురత్ ఒంగున్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు అసలు విషయం బయటపడింది.

దీంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తూ.. మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లును చెడుగా చూపించడానికే ఇలా చేస్తున్నారంటూ అక్కడ స్థానిక మీడియా చెప్పింది. అంతేకాదు గతంలో మేయర్‌ పరువు తీయడానికి గతంలో కూడా అనేక ప్రయత్నాలు జరిగాయని తెలిపింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగ్గు తెచ్చుకోండి మరీ ఇలాంటి పనులు చేస్తారా..? అంటూ ఆ వ్యక్తి పై మండిపడుతూ ట్వీట్‌ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ జగుప్సాకరమైన వీడియోను చూడండి.. వైరల్ వీడియో..

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సీట్లో కుక్క మలం ఉంచిన వ్యక్తిని అందరూ.. తిడుతూ పోస్టులు చేస్తున్నారు. మనుషులెవరైనా ఇలా చేస్తారా అంటూ అతనిపై మండిపడుతున్నారు.

Also Read:

E-Rickshaw Driver: 15 క్వశ్చన్లకు ఆన్సర్ చెబితే.. ఆటోలో ఫ్రీగా ప్రయాణం.. రిక్షావాలా జ్ఞానానికి నెటిజన్ల ఫిదా..

Bride Dharna: మరికాసేపట్లో పెళ్లి.. హ్యాండిచ్చిన వరుడు.. ధర్నాకు దిగిన వధువు.. అసలేమైందంటే..?