Indian Railways: 60ఏళ్ల క్రితం నాశనమైన రామేశ్వరం-ధనుష్కోడి లైన్‌ను పునరుద్ధరించే దిశగా రైల్వే శాఖ అడుగులు

|

May 31, 2022 | 1:07 PM

1964లో వచ్చిన ఉప్పెనలో ఈ రైల్వే లైన్ ధ్వంసమైందని మధురై డివిజన్ డివిజనల్ ఇంజనీర్ హృదయేష్ కుమార్ చెప్పారు. “ఇప్పుడు ప్రభుత్వం దీనిని పునర్నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ రైలు మార్గాన్ని నిర్మించడానికి రూ. 700 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది.

Indian Railways: 60ఏళ్ల క్రితం నాశనమైన రామేశ్వరం-ధనుష్కోడి లైన్‌ను పునరుద్ధరించే దిశగా రైల్వే శాఖ అడుగులు
Rameswaram Dhanushkodi Line
Follow us on

Indian Railways: దక్షిణ రైల్వే చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే తమిళనాడులోని రామేశ్వరం-ధనుష్కోడి ల ( Rameswaram -Dhanushkodi )మధ్య రైలు మార్గాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం రెడీ అయింది. దేశంలో అనేక ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసిన భారతీయ రైల్వే శాఖ ఇప్పుడు రామేశ్వరం, ధనుష్కోడిని రైలు మార్గంతో అనుసంధానించడానికి సిద్ధంగా ఉంది. ఈ రైలు మార్గాన్ని నిర్మించడానికి రూ. 700 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది.

రామేశ్వరం, ధనుష్కోడిని మరోసారి రైల్వే లైన్‌తో అనుసంధానించాలని..తద్వారా రామేశ్వరం వచ్చే పర్యాటకులు ధనుష్కోడి చేరుకోవడానికి ఈజీగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖకు జోనల్ ఆఫీస్ పంపిన కొత్త ప్రతిపాదనలో పేర్కొంది. 1964లో వచ్చిన ఉప్పెనలో ఈ రైల్వే లైన్ ధ్వంసమైందని మధురై డివిజన్ డివిజనల్ ఇంజనీర్ హృదయేష్ కుమార్ చెప్పారు. “ఇప్పుడు ప్రభుత్వం దీనిని పునర్నిర్మించాలని ప్రతిపాదించిందని తెలిపారు. కొత్త ప్రతిపాదన ప్రకారం  18 కిలోమీటర్ల రైల్వే లైన్‌లో భూమి నుండి 13 కిలోమీటర్ల ఎలివేటెడ్ ట్రాక్ ఉంటుంది. ఈ ప్రాంతం పర్యాటక రంగంగానే కాదు..  మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది కనుక.. రామేశ్వరం, ధనుష్కోడిని కలుపుతూ లైన్ నిర్మాణం రెడీ అయితే..  ఈ ప్రాంతం మరింత మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

“కొత్త రైలు లింక్ ప్లాన్ గురించి .. మదురై డివిజన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆనంద్ మాట్లాడుతూ.. రైల్వే శాఖ ఈ  స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేసి..  కొత్త బ్రాడ్ గేజ్, ఎలక్ట్రిక్ లైన్‌తో అనుసంధానించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ రైల్వే లైన్ రామేశ్వరం నుండి 18 కి.మీ నిర్మించనున్నారు. మార్గంలో  3 స్టేషన్స్  కలిగి ఉంటుంది. రెండు స్టేషన్లు ఒక  టెర్మినల్ స్టేషన్ ని నిర్మించే ప్రతిపాదన చేశారు. దీంతో ఇక్కడ కూడా పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని తాము  ఆశిస్తున్నామని.. రామేశ్వరం స్టేషన్‌ను పునరాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

“భౌగోళికంగా.. ధనుష్కోడి..  పాక్ జలసంధి ద్వారా వేరు చేయబడిన పాంబన్ వంతెనకు ఆగ్నేయముగా ఉంది. డిసెంబర్ 1964 వరకు, ధనుష్కోడి ఒక ప్రసిద్ధ రైల్వే స్టేషన్..  ఇది నేరుగా తమిళనాడులోని మండపం స్టేషన్‌తో అనుసంధానించబడింది. ఆ సమయంలో ధనుష్కోడి స్టేషన్..  శ్రీలంకలోని సిలోన్..  భారతదేశంలోని మండపంలను అనుసంధానం చేసే ముఖ్యం స్టేషన్. ఆ సమయంలో బోట్ మెయిల్ పేరుతో రైలు కూడా నడిచేది. కానీ రామేశ్వరము నుండి ధనుష్కోడి వరకూ ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన ఉప్పెనలో, ప్రయాణీకులతో సహా కొట్టుకు పోయింది. రైలు సిబ్బందితో పాటు వందలాది మంది ప్రయాణికులు చనిపోయారు. అప్పటి నుండి, ధనుష్కోడిని రైలు మార్గానికి తిరిగి అనుసంధానించడం పై దృష్టి పెట్టలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..