Special Train: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్: ఎర్నాకులం నుంచి ధనపూర్‌కు ప్రత్యేక రైలు..

| Edited By: Anil kumar poka

Nov 05, 2021 | 11:02 AM

Special Train: దేశంలోఅతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వే అని చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మందిని గమ్య స్థానాలకు చేర్చుతుంది. ఇక దీపావళి సందర్భంగా..

Special Train:  రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్: ఎర్నాకులం నుంచి ధనపూర్‌కు ప్రత్యేక రైలు..
Follow us on

Special Train: దేశంలోఅతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వే అని చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మందిని గమ్య స్థానాలకు చేర్చుతుంది. ఇక దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ఇక తాజాగా నవంబర్‌ 5న ఎర్నాకులం నుంచి ధనపూర్‌కు ప్రత్యేక రైలు (06043) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు రాత్రి 11.35 గంటలకు బయలుదేరనుంది. వయా విజయవాడ మీదుగా వెళ్లనుంది. కాగా, పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రైలు అలువ, త్రిశూర్‌, పాలకాడ, కోయంబత్తూరు, తిరుప్పూర్‌, ఈరోడ్‌, సేలం, కట్పాడి, తిరుత్తాని, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సమల్‌కోట్‌, దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బెహ్రంపూర్, కట్టక్‌, భద్రాక్‌, బాలసోర్‌, ఖరాగ్‌పూర్‌, ధన్‌కుని, దుర్గాపూర్‌ తదితర స్టేషన్‌లలో ఆగనుంది.

కాగా, దేశ వ్యాప్తంగా అత్యంత సంబురంగా జ‌రుపుకునే పండుగ‌ల్లో దీపావ‌ళి ఒక‌టి. ఉత్తర భార‌త దేశం, ద‌క్షిణ భార‌త దేశం అనే తేడా లేకుండా దేశ ప్రజ‌లంతా ఈ పండుగ‌ను ఘనంగా జరుపుకొంటారు. దీంతో ఈ పండుగ‌కు సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. దీంతో పండుగ‌ల వేళ ప్రయాణికుల‌తో రైళ్లన్నీ కిక్కిరిసిపోతుంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు ఈసారి ప్రత్యేక ఏర్పాటు చేశారు.

 

ఇవి కూడా చదవండి:

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రోజు రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షల బెనిఫిట్‌.. ఎలాగంటే..

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. తాజా రేట్ల వివరాలు