Indian Railways: ఇక నుంచి ఐఆర్‌సీటీసీ పీఎన్ఆర్ స్టేటస్‌ను వాట్సప్‌లోనూ చెక్ చేసుకోవచ్చు.. అదెలాగంటే..

|

Nov 10, 2022 | 6:33 PM

IRCTC: ఐఆర్‌సీటీసీ పీఎన్ఆర్ స్టేటస్‌ను ట్రా చేయడం ఇప్పుడు మరింత సులభతరం చేసింది భారత రైల్వే శాఖ. రైల్వే ప్రయాణికులు ఇప్పుడు తమ వాట్సాప్‌లోనూ..

Indian Railways: ఇక నుంచి ఐఆర్‌సీటీసీ పీఎన్ఆర్ స్టేటస్‌ను వాట్సప్‌లోనూ చెక్ చేసుకోవచ్చు.. అదెలాగంటే..
Irctc Pnr Status
Follow us on

ఐఆర్‌సీటీసీ పీఎన్ఆర్ స్టేటస్‌ను ట్రా చేయడం ఇప్పుడు మరింత సులభతరం చేసింది భారత రైల్వే శాఖ. రైల్వే ప్రయాణికులు ఇప్పుడు తమ వాట్సాప్‌లోనూ రియల్ టైమ్ ట్రైన్ రన్నింగ్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్‌ను చూడొచ్చు. ముంబైకి చెందిన స్టార్టప్ రైలోఫీ-రోడియో ట్రావెల్ టెక్నాలజీస్‌తో కలిసి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో ప్రయాణికులు తమ రైలు స్థితిని, పీఎన్ఆర్ వివరాలను వాట్సాప్‌ ద్వారా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.

వాట్సాప్‌లో PNRని ఎలా చెక్ చేయాలంటే..

స్టెప్ 1: ముందుగా మీ మొబైల్‌లో రైలోఫీ నంబర్ 9881193322 ని సేవ్ చేసుకోవాలి.

స్టెప్ 2: ఈ నెంబర్‌ను సేవ్ చేసిన తరువాత మీ వాట్సాప్ ఓపెన్ చేయాలి.

ఇవి కూడా చదవండి

స్టెప్ 3: వాట్సాప్ ఓపెన్ చేసిన తరువాత కాంటాక్ట్స్ లిస్ట్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయాలి. ఆ తరువాత మీ వాట్సాప్‌లో సేవ్ చేసిన నెంబర్‌ను వెతకాలి.

స్టెప్ 4: చాట్ విండో తెరిచిన తరువాత.. మీరు మీ 10 అకెంల PNR నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ చేయాలి.

స్టెప్ 5: ఆ తరువాత రైలోఫీ చాట్‌బాట్‌లో మీ ట్రావెలింగ్ డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తుంది. ట్రైన్ రియల్ టైమ్ లొకేషన్, నోటిఫికేషన్స్ అన్ని వివరాలను తెలియజేస్తుంది.

ఫోన్ కాల్, మెసేజ్ కూడా చేయొచ్చు..

కాగా, PNR స్టేటస్‌ని స్మార్ట్ ఫోన్ ద్వారా 139 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అలాగే.. 139, 5676747 నెంబర్లకు మెసేజ్ సెండ్ చేయడం ద్వారా కూడా PNR స్టేటస్‌ని తెలుసుకోవచ్చు.

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్..

ఇదిలాఉంటే.. IRCTC జూప్ చాట్‌బాట్ ద్వారా రైలు ప్రయాణంలో ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయొచ్చు. ఇందుకోసం ప్రయాణికులు +91 7042062070 సేవ్ చేసుకుని, వాట్సాప్ ద్వారా ఈ ఫుడ్ ఆర్డర్ సౌకర్యాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా రెస్టారెంట్‌లను ఎంచుకుని, డెలివిరీ కోసం రాబోయే స్టేషన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..