AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC offer: ఐఆర్‌సీటీసీ బంఫర్ ఆఫర్.. అదిరే క్యాష్‌బ్యాక్.. కొన్ని రోజులు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవి

ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సూపర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ రైల్వే టికెట్ బుకింగ్‌ను సులభతరం చేసే ఐముద్రా అనే యాప్‌ సేవలను...

IRCTC offer: ఐఆర్‌సీటీసీ బంఫర్ ఆఫర్.. అదిరే క్యాష్‌బ్యాక్..  కొన్ని రోజులు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవి
RBI News
Ram Naramaneni
|

Updated on: Feb 04, 2021 | 8:34 AM

Share

IRCTC offer:  ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సూపర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ రైల్వే టికెట్ బుకింగ్‌ను సులభతరం చేసే ఐముద్రా అనే యాప్‌ సేవలను కూడా అందిస్తోన్న విషయం తెలిసిందే.  ఐముద్రా కస్టమర్లకు ఐముద్రా వీసా కార్డు లేదా ఐముద్రా రూపే కార్డు లభిస్తుంది. ఇది డిజిటల్ రూపంలో లభిస్తోంది. ఫిజికల్ కార్డు కూడా తీసుకోవచ్చు. ఈ కార్డులు ఉపయోగించే వారికి చాలా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఐఆర్‌సీటీసీ ఐముద్రా వీసా లేదా రూపే కార్డు ఉపయోగించే కస్టమర్లు ఏకంగా రూ.2 వేల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. దీని కోసం రూ.5 వేలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు అందుబాటులో ఉంటుంది. ఫెడరల్ బ్యాంకు సహకారంతో  ఐఆర్‌సీటీసీ ఐముద్ర వీసా కార్డులను జారీ చేస్తోంది. దీని ద్వారా  భారతీయ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేయవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్, ఏటఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వంటి పలు రకాల సేవలు పొందొచ్చు. అయితే భారతీయ వెబ్‌సైట్‌లో మాత్రమే కొనుగోళ్లు చేయడానికి మీరు ఐముద్ర వీసా కార్డును ఉపయోగించవచ్చు. దీనితో షాపింగ్ భారత కరెన్సీలో మాత్రమే చేయాలి.

మీ ఐఆర్‌సిటిసి ఐముద్రా వాలెట్‌కు డబ్బును యాడ్ చేయడానికి డెబిట్ కార్డ్, యుపిఐ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు. డబ్బును జోడించడానికి, మీరు మీ iMudra యాప్‌లో డబ్బును జోడించు ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆపై మీరు ఆ మొత్తాన్ని ఎంచుకుని, మీ వాలెట్‌లో లోడ్ చేయడానికి ముందుకు సాగాలి.

Free Tax and Registration: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు..

AP SCC Exam Time Table : ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల.. 11 పరీక్ష పేపర్లు కాదు.. ఎన్నో తెలుసా..