AP SCC Exam Time Table : ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల.. 11 పరీక్ష పేపర్లు కాదు.. ఎన్నో తెలుసా..

ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది.  జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 7 పేపర్లు ఉంటాయి. సైన్స్ మాత్రమే రెండు పేపర్లు ఉంటుంది. ఈ వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం...

AP SCC Exam Time Table : ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల.. 11 పరీక్ష పేపర్లు కాదు.. ఎన్నో తెలుసా..
AP SCC Results
Follow us

|

Updated on: Feb 03, 2021 | 5:51 PM

AP SCC Exam Time Table : ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది.  జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 7 పేపర్లు ఉంటాయి. సైన్స్ మాత్రమే రెండు పేపర్లు ఉంటుంది. ఈ వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం వెల్లడించారు.  జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. సైన్స్ లో రెండు పేపర్లు ఉంటాయని.. జులై 21 నుంచి నూతన  విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని వెల్లడించారు. కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా స్కూళ్లలో ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్.

టెన్త్ షెడ్యూల్ ఇలా…

ఏపీలో జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు జూన్ నుంచి 16 వరకు పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో ఏడు పేపర్లు.. వంద మార్కులకు పరీక్షలు జూన్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, 8న సెకండ్ లాంగ్వేజ్, 9 ఇంగ్లీష్.. సైన్స్‌లో రెండు పేపర్లు..  జూన్ 11న ఫిజిక్స్, 12న బయోలజీ, 14న సోషల్

ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో బడిగంటలు మోగుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి అన్ని పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఒకటో తరగతి నుంచి టెన్త్‌ వరకు అన్ని క్లాసులు జరుగుతాయన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. జూన్‌ 5 వరకు తరగతులు నిర్వహిస్తారు. మొత్తం 167 పనిదినాలు అవుతాయి. అందుకు తగ్గట్టు సిలబస్‌ను 35 శాతం మేర తగ్గించారు. ఈసారి సమ్మర్ హాలిడేస్‌ కాదు కానీ.. మే 16 నుంచి జూన్‌ 30 వరకు సెలవులిస్తారు. జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..