నందికొట్కూరు వైసీపీలో భగ్గుమన్న విబేధాలు.. మంత్రుల సమక్షంలోనే బాహాబాహీకి దిగిన నేతలు
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కాకపోతే ఈసారి మరో మెట్టు ఎక్కి ఏకంగా మంత్రుల సమక్షంలోనే..
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కాకపోతే ఈసారి మరో మెట్టు ఎక్కి ఏకంగా మంత్రుల సమక్షంలోనే తన్నుకునే ప్రయత్నం చేయడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.
అయితే ఒక్కో నియోజకవర్గ సమస్యలపై చర్చించిన తర్వాత నందికొట్కూరు విభేదాలపై చర్చించారు. చర్చ జరుగుతుండగానే నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే ఆర్థర్, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య విభేదాలు వచ్చాయి. సిద్ధార్థ రెడ్డి పీఏ రమణ, వైసిపి నేత చెరుకుచెర్ల రఘురామయ్య మధ్య వాగ్వాదం పెరిగి కుర్చీలు ఎత్తుకునే వరకు వెళ్ళింది. చివరకు మంత్రులు సీరియస్ కావడంతో సద్దుమణిగింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
నిమ్మగడ్డను విడువని వైసీపీ నేతలు.. అక్కడికి ఎస్‌ఈసీ వెల్లడం ఆశ్చర్యంగా ఉందన్న అంబటి
తమిళనాడు ఎన్నికల బరిలో రాధిక.. ఏ పార్టీ నుంచి.. ఏ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారో తెలుసా?