Valentine’s Day Gift : టాటా పేరుతో డేటా దోపిడీ.. ప్రేమికుల రోజు బహుమతంటూ సైబర్ కేటుగాళ్ల మాయాజాలం
యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. టాటా ప్రమోషన్‌ను ఐదు వాట్సాప్ గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు పంపించాలనే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే..? ఈ మెస్సేజ్ వాట్సప్‌లో వైరల్ అవుతోంది.
Valentine’s Day Gift : ఏదినిజం? : సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న టాటా కంపెనీ ప్రకటనా నిజమేనా? మరి.. ప్రేమికులకు రోజు బహుమతుల పేరుతో ఈ గందరగోళానికి అసలు కారణమేంటో తెలుసా? ఈ అంశానికి సంబంధించి ఫ్యాక్ట్‌ఫుల్ వివరణాత్మక కథనం…
మీ వాట్సప్ గ్రూప్‌తోపాటు మీకు వ్యక్తిగతంగా ఓమెస్సేజ్ వస్తుంది. ప్రేమికుల దినోత్సవం రోజు టాటా కంపెనీ మీకు మంచి గిఫ్ట్ ఇస్తోంది అంటూ ఉంటుంది. అందులో… సులువైన ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఎంఐ11టీ ఫోన్ గెలుచుకోవచ్చని ఉంటుంది. ఆ తర్వాత ఫోన్ గెలుచుకున్నారని మెస్సేజ్ వస్తుంది. ఆ తర్వాత.. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. టాటా ప్రమోషన్‌ను ఐదు వాట్సాప్ గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు పంపించాలనే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే..? ఈ మెస్సేజ్ వాట్సప్‌లో వైరల్ అవుతోంది. వాట్సప్‌లోనే కాకుండా.. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో కూడా తిరుగుతోంది. అందరిచేతుల్లో స్మార్ట్ ఫోన్లు, ఫేస్‌బుక్ నుంచి ట్విట్టర్‌దాకా సోషల్ మీడియాలో చాటింగ్. క్లిక్ చేస్తే చాలు మన ఫోన్‌లో వివరాలు మాయం అవుతాయి.
సైబర్‌నేరాల్లో ఆరితేరినవాళ్లకు కావాల్సినంతమంది కస్టమర్లు. పదిమందికి వలేస్తే ఒక్క చేపయినా చిక్కకుండా ఉంటుందా. అదే జరుగుతోంది. సైబర్ క్రైమ్‌లోనూ .. కొత్త ట్రెండింగ్ నడుస్తోందిప్పుడు. సగటు భారతీయుడి వీక్ పాయింట్‌ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. చివరికి ప్రేమికుల దినోత్సవాన్ని కూడా తమ చీటింగ్ లిస్ట్‌లో చేర్చేశారు సైబర్ నేరగాళ్లు. తాజాగా అందిరి వాట్సప్ గ్రూపుల్లో ఒకటే మెసెజ్ రింగులు కొడుతోంది.
అదే.. భారతీయ వ్యాపర దిగ్గజం టాటా పేరుతో సోషల్ మీడియాలో ఈ మెసెజ్ చక్కర్లు కొడుతోంది. డేటా చోరీకి పాల్పడేందుకు ప్రేమికుల రోజును ఎంపిక చేసుకున్నారు. తమ మోసాలకు టాటా కంపెనీని వాడుకున్నారు. పెద్ద కంపెనీ అయితే జనం ఈజీగా నమ్మేస్తారని ప్లాన్ చేశారు.
ప్రశ్నలకు సమాధానాలు చెప్పి… ప్రేమికుల రోజున మొబైల్ గెలుచుకోవచ్చంటూ అమాయకులకు గాలం వేస్తున్నారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు కోరుతున్నారు. సైబర్ నేరగాళ్లు సులువైన ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఎంఐ11టీ ఫోన్ గెలుచుకోవచ్చని ఉచ్చులోకి దింపుతున్నారు. ఆ తర్వాత ఫోన్ గెలుచుకున్నారని మెసేజ్ వస్తుంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. అది డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఫోన్, లాప్‌టా్‌పలోని డేటా చోరీ అవుతుందని పోలీసులు తెలిపారు. బ్యాంకు లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరుకొంటాయన్నారు. టాటా ప్రమోషన్‌ను ఐదు వాట్సాప్ గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు పంపించాలనే సూచనతో నేరగాళ్లు పంపే లింక్‌ను ఇతరులకు పంపుతున్నారని పోలీసులు చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు.. AP SCC Exam Time Table : ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. 11 పరీక్ష పేపర్లు కాదు.. ఎన్నో తెలుసా.. Stock Market Bull Run : దలాల్ స్ట్రీట్‌లో బుల్ రంకెలు.. నిర్మలమ్మ బడ్జెట్ ఇచ్చిన జోష్‌తో హాట్రిక్ పరుగులు..