AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market Bull Run : దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ రంకెలు.. నిర్మలమ్మ బడ్జెట్‌ ఇచ్చిన జోష్‌తో హాట్రిక్ పరుగులు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లో వరుసగా మూడో రోజూ కూడా భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఆరంభంనుంచి మంచి జోష్‌తో మొదలైన కీలక సూచీలు బుధవారం మరో జీవితకాల గరిష్టాలను నమోదు చేసాయి. 

Stock Market Bull Run : దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ రంకెలు.. నిర్మలమ్మ బడ్జెట్‌ ఇచ్చిన జోష్‌తో హాట్రిక్ పరుగులు..
stock market bull run
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 6:29 PM

Share

Stock Market : దేశీయ స్టాక్‌ మార్కెట్లో వరుసగా మూడో రోజూ కూడా భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఆరంభంనుంచి మంచి జోష్‌తో మొదలైన కీలక సూచీలు బుధవారం మరో జీవితకాల గరిష్టాలను నమోదు చేసాయి.  నిర్మలమ్మ బడ్జెట్‌ ఇచ్చిన జోష్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ వెవ్ తోడవ్వడంతో దేశీయ మార్కెట్లు మూడవ రోజు కూడా భారీ లాభాలతో ముగిసింది. ఇందులో ఆటో, ఫార్మా, మెటల్‌ షేర్లు దూకుడును ప్రదర్శించడంతో సెన్సెక్స్‌ మళ్లీ 50వేల మార్కును అందుకుంది.

అలా మొదలైన కాసేపటికే…

బుధవారం రోజు ఉదయం మార్కెట్లు ప్రారభమైన కాసేపటికే 49,952 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కొద్దిసేపు నష్టాల్లోకి వెళ్లిపోయింది. అయితే.. ఆ తర్వాత తన దూకుడును చూపించింది. ఒకానొక దశలో 50,500 పాయింట్ల దాటి జీవన కాల గరిష్ఠాలను తాకిన సూచీ చివరికి 458.03 పాయింట్ల లాభంతో 50,255.75 వద్ద ముగిసింది.

నిఫ్టీ సైతం…

నిఫ్టీ సైతం 142.10 పాయింట్లు లాభపడి 14,789.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో బ్యాంకిగ్, పవర్ లాభపడ్డాయి. లాభపడినవాటిలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, దివీస్‌ ల్యాబ్స్‌, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..