నగరంలో నకిలీ నక్సలైట్.. బడా వ్యాపారవేత్తలే అతడి టార్గెట్.. ఓ వ్యక్తిని బెదిరిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్..

నగరంలో నకిలీ నక్సలైట్లు సంచరిస్తున్నారు. బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా నక్సలైట్ నంటూ బెదిరింపులకు

నగరంలో నకిలీ నక్సలైట్.. బడా వ్యాపారవేత్తలే అతడి టార్గెట్.. ఓ వ్యక్తిని బెదిరిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్..
Follow us
uppula Raju

|

Updated on: Feb 03, 2021 | 4:18 PM

నగరంలో నకిలీ నక్సలైట్లు సంచరిస్తున్నారు. బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా నక్సలైట్ నంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన నరసింహ అలియాస్ దామోదర్ తాను నక్సలైట్‌నంటూ చెప్పుకుంటూ వ్యాపారవేత్తలను టార్గెట్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తాజాగా హైదరాబాద్‌ నగరంలోని భగవాన్ కాలనీ కి చెందిన ఓ వ్యాపార వేత్తకు ఫోన్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే పది లక్షల నుంచి చివరకు రూ. 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధితుడు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి ఖాకీలు ప్రవేశించారు. పథకం ప్రకారం దామును రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నరసింహ అలియాస్ దాము పాత ఫోన్లు కొనుగోలు చేస్తూ ఆయా ఫోన్ల ద్వారా వేధింపులకు పాల్పడినట్టు తెలిసింది. కొన్ని చోట్ల నయీమ్ అనుచరులుగా, మరికొన్ని చోట్ల సమ్మయ్య దళం సభ్యులుగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తేలింది. జవహర్ నగర్ పురపాలక సంఘం ప్రజా ప్రతినిధిని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటికొచ్చింది. నరసింహ భార్య అధికార పార్టీకి చెందిన గంధమల్ల ఎంపీటీసీ కనకలక్ష్మిగా గుర్తించారు. ఇప్పటికే నరసింహ ఎలియాస్ దాము పై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో దాముకు సెంట్రింగ్ పని చేసే కనకయ్య సహకరంచినట్లుగా తేలింది. దాము నుంచి స్వాధీనం చేసుకున్న మారుతి బ్రీజా కార్ లో కనకయ్యకు సంబంధించిన లెటర్ ప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ సంబంధం : భర్తను వదిలేసింది, నాలుగేళ్ల కుమారుడిని చంపేసింది