Indian Railways: బంగ్లాదేశ్‌కు 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందించిన భారతీయ రైల్వే.. కారణం ఏమిటంటే..?

|

May 24, 2023 | 1:50 PM

Indian Railways: బంగ్లాదేశ్, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఆ దేశానికి 20 బ్రాడ్ గేజ్(బి.జి) లోకోమోటివ్‌లను ప్రారంభించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా..

Indian Railways: బంగ్లాదేశ్‌కు 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందించిన భారతీయ రైల్వే.. కారణం ఏమిటంటే..?
Union Minister Ashwini Vaishnav flagged off virtually for broad gauge locomotives
Follow us on

Indian Railways: బంగ్లాదేశ్, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఆ దేశానికి 20 బ్రాడ్ గేజ్(బి.జి) లోకోమోటివ్‌లను ప్రారంభించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వేస్ రైల్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా జెండా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ నుంచి రైల్వే మంత్రి మొహ్మద్ నూరుల్ ఇస్లాం సుజన్ కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. అయితే అక్టోబరు 2019లో బంగ్లా ప్రధాన మంత్రి షేక్ హసీనా భారతదేశ పర్యటన సందర్భంగా చేసిన ముఖ్యమైన నిబద్ధతను నెరవేర్చే క్రమంలో ఈ డీజిల్ లోకోమోటివ్‌లను భారత ప్రభుత్వం మంజూరు చేస్తూ బంగ్లా దేశ్‌కు అప్పగించడం జరిగింది. బంగ్లాదేశ్ అవసరాలకు అనుగుణంగా ఆ దేశంలో పెరుగుతున్న ప్రయాణీకులు, రైల్వే లోకోమోటివ్‌ల అవసరాలను తీర్చడం కోసం భారతదేశంలోని లోకోమోటివ్‌లను తగు మార్పులు చేసి బంగ్లాదేశ్‌కు అందించడం జరిగినది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య నాగరికత, సాంస్కృతిక, సామాజిక , ఆర్థిక, రాజకీయ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరు దేశాల ప్రధానులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సరిహద్దులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడంలో, బలోపేతం చేయడంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మెరుగుపరచడంలో భారతీయ రైల్వే కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతానికి గెడా- దర్సనా.. బెనాపోల్-పెట్రాపోల్.. సింగాబాద్- రోహన్‌పూర్.. రాధికాపూర్- బిరోల్..హల్దిబారి-చిలహతి మధ్య బి.జి కనెక్టివిటీ పనిచేస్తోంది. అఖౌరా-అగర్తలా, మహిహాసన్-షాబాజ్‌పూర్ మధ్య మరో రెండు క్రాస్ బోర్డర్ రైలు కనెక్టివిటీల పనులు జరుగుతున్నాయి. వీటిని త్వరలో పూర్తి చేసి ప్రారంభించే అవకాశం ఉందని వైష్ణమ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి


ఈ సంర్భంగా బంగ్లాదేశ్ రైల్వే మంత్రి నూరుల్ ఇస్లాం సుజన్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘భారత ప్రభుత్వం మాకు అండగా నిలిచినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో జూన్ 2020లో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు 10 లోకోమోటివ్‌లను గ్రాంట్‌ చేసింది. బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందించినందుకు భారత్‌కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ లోకోమోటివ్‌ల సరఫరా గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, రైల్వే రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సహకారం రోజురోజుకు పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల  కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..