Indian Railways: 35 పైసలతో రూ. 10 లక్షల బీమా.. ట్రైన్ టికెట్ తీసుకునే ముందు ఈ ఆప్షన్ అస్సలు వదలొద్దు..

|

Jun 04, 2023 | 5:37 AM

బాలాసోర్‌ ఘోర రైలు ప్రమాదంలో వందలాది కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. వేలాది మంది హృదయాలు ఛిద్రం చేసింది ఈ మహా విషాదం. తరుముకొచ్చిన మృత్యువునుంచి తప్పించుకోలక విలవిలలాడారు జనం. 280 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో ఎన్నో కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి.

Indian Railways: 35 పైసలతో రూ. 10 లక్షల బీమా.. ట్రైన్ టికెట్ తీసుకునే ముందు ఈ ఆప్షన్ అస్సలు వదలొద్దు..
Train Travel Insurance
Follow us on

బాలాసోర్‌ ఘోర రైలు ప్రమాదంలో వందలాది కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. వేలాది మంది హృదయాలు ఛిద్రం చేసింది ఈ మహా విషాదం. తరుముకొచ్చిన మృత్యువునుంచి తప్పించుకోలక విలవిలలాడారు జనం. 280 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో ఎన్నో కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. అయితే ఇదే సందర్భంలో రైలు ప్రయాణ బీమా ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ మనకు కనిపిస్తుంది. దీన్నెవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం ఐఆర్‌సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే తీసుకుంటుంది. రూ.10 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. వస్తువులు, లగేజీని పోగొట్టుకున్నా ఈ బీమా ద్వారా పరిహారం లభిస్తుంది.

రైలు ప్రమాదం జరిగినప్పుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షల వరకు బీమా మొత్తం చెల్లిస్తారు. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ.10,000 వరకు అందజేస్తారు.

ఇవి కూడా చదవండి

రైలు ప్రమాదానికి గురైన 4 నెలల్లోపు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి బీమా కోసం క్లెయిమ్‌ను దాఖలు చేయాలి. అయితే బీమాను ఎంచుకునే సమయంలో తప్పనిసరిగా నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..