కరోనా ఎఫెక్ట్: ఇకపై రైల్వే టీటీఈలు ఎలా కనిపించబోతున్నారంటే..!

కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో రైల్వే టీటీఈలకు రైల్వే బోర్డు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించనున్న

  • Tv9 Telugu
  • Publish Date - 7:00 am, Sat, 30 May 20
కరోనా ఎఫెక్ట్: ఇకపై రైల్వే టీటీఈలు ఎలా కనిపించబోతున్నారంటే..!

కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో రైల్వే టీటీఈలకు రైల్వే బోర్డు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించనున్న టీటీఈలు దూరంగా నిలబడి భూతద్దం ద్వారా టికెట్లను పరిశీలించనున్నారు. కరోనా ముప్పును తగ్గించేందుకు టై, కోటును ధరించకుండానే టీటీఈలు విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు తెలిపింది. అలాగే పేరు కలిగిన ప్లేట్‌ మాత్రం ధరించాలని సూచించింది. జూన్‌ 1 నుంచి ప్రారంభం కాబోతున్న 100 జంట రైళ్లలో వీరు ఈ విధంగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక విధుల్లోకి వెళ్లే ముందు టీటీఈలకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయనున్నారు. వారికి మాస్కులు,  గ్లౌజులు, తలకు ధరించే కవర్లు, శానిటైజర్లు, సోపులు, భూతద్దంను రైల్వే అధికారులు అందించనున్నారు. కాగా ఉద్యోగులకు శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉంటే ముందే చెప్పాలని రైల్వే శాఖ ఉద్యోగులను కోరింది.

కాగా వలస కూలీల కోసం ప్రవేశపెట్టిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వస్తోన్న విమర్శలపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. వలస కూలీల అవసరాన్ని బట్టి  ఈ రైళ్లు వాటి గమ్యస్థానాన్ని పొడిగించడం లేదా కుదించడం, దారి మళ్లించడం చేస్తున్నామని, అందువల్లే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని వివరించింది. మే 1 నుంచి ఇప్పటి వరకు 3,840 ప్రత్యేక రైళ్లు నడిపామని, అందులో 52 లక్షల మంది కార్మికులు ప్రయాణించారని రైల్వేబోర్డు చైర్మన్‌ వి.కె.యాదవ్‌ తెలిపారు.

Read This Story Also: ఎన్నో చేదు అనుభవాలు నన్ను వెంటాడాయి..సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన న‌టి