NRI Yusuffali: మనసున్న మహరాజు… కోటి రూపాయలు చెల్లించి ఉద్యోగి ప్రాణాలు నిలబెట్టాడు..

|

Jun 04, 2021 | 12:06 PM

NRI Yusuffali: కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, లులు గ్రూప్‌ అధినేత, ఎన్నారై ఏంఏ యూసఫ్‌ అలీ మానవత్వం చాటుకున్నారు. ఏకంగా కోటి రూపాయలు పరిహారం చెల్లించి.

NRI Yusuffali: మనసున్న మహరాజు... కోటి రూపాయలు చెల్లించి ఉద్యోగి ప్రాణాలు నిలబెట్టాడు..
Nri Yusuffali
Follow us on

NRI Yusuffali: కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, లులు గ్రూప్‌ అధినేత, ఎన్నారై ఏంఏ యూసఫ్‌ అలీ మానవత్వం చాటుకున్నారు. ఏకంగా కోటి రూపాయలు పరిహారం చెల్లించి ప్రసవా భారతీయుడిని ఉరిశిక్ష నుంచి కాపాడటం హర్షం వ్యక్తం అవుతోంది. 2012లో అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత వ్యక్తి వాహనం కిందపడి ఓ సుడాన్‌ బాలుడు మృతి చెందాడు. ఈ కేసులో యూఏఈ సుప్రీం కోర్టు భారత ప్రవాసుడికి మరణ శిక్ష విధించింది. తాజాగా మృతుడి కుటుంబ సభ్యులు క్షమాభిక్షకు అంగీకరించారు. దీంతో న్యాయస్థానం మృతుడి ఫ్యామిలీకి నిందితుడు 5 లక్షల దిర్హమ్స్‌ (సుమారు కోటి రూపాయలు) పరిహారం ఇవ్వాలని తెలిపింది. ఈ పరిహారం విషయమై కుటుంబ సభ్యులు యూసఫ్‌ అలీని సంప్రదించారు. తమ పరిస్థితి గురించి వివరించి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. దీంతో ఈ పరిహారం చెల్లించేందుకు యూసఫ్‌అలీ అంగీకరించారు.

కాగా, కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌కు చెందిన బెక్స్ క్రిష్ణన్‌ ఉపాధి నిమిత్తం యూఏఈ వెళ్లాడు. ఈ క్రమంలో 2012 సెప్టెంబ‌ర్‌లో బెక్స్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కన వెళ్తున్న కొంతమంది పిల్లలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుడాన్‌కు చెందిన ఓ బాలుడు మృతి చెందాడు. దీంతో ఈ ప్రమదానికి కారణమైన బెక్స్‌కు యూఏఈ సుప్రీం కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే కొంత కాలానికి మృతుడి ఫ్యామిలీ యూఏఈ నుంచి సుడాన్‌ వెళ్లిపోయింది. బెక్స్‌ మాత్రం 9 సంవత్సరాలుగా యూఏఈ జైల్లో మగ్గుతున్నాడు. దీంతో అతని కుటుంబం ఈ విషయాన్ని యూసఫ్‌ అలీ దృష్టికి తీసుకెళ్లింది. ఇక బెక్స్‌కు ఉరి శిక్ష నుంచి తప్పించాలంటే ఏకైక మార్గం. మృతుడి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించడం మాత్రమే. యూసఫ్‌ అలీ బెక్స్‌ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో 2021 జనవరిలో బాలుడి కుటుంబం క్షమాభిక్షకు అంగికరించింది. ఈ విషయాన్ని యూఏఈ కోర్టుకు తెలియజేయడంతో నిందితుడు బెక్స్‌.. మృతుడి కుటుంబానికి 5 లక్షల దిర్హమ్స్‌ ( రూ. కోటి) పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దాంతో బెక్స్‌ తరపున ఈ పరిహారం చెల్లించేందుకు యూసుఫ్‌అలీ ముందుకు వచ్చారు. గురువారం బెక్స్‌ విడుదలకు సంబంధించిన అన్ని చట్టపరమైన పనులు పూర్తి అయ్యాయి. త్వరలోనే జైలు నుంచి బెక్స్‌ స్వదేశానికి రానున్నారు. తాను జైలు నుంచి విడుదలై స్వదేశానికి వెళ్లే ముందు తనకు మరో జన్మను ప్రసాదించిన యూసఫ్‌ అలీని ఒక్కసారి కావాలని ఉందని బెక్స్‌ చెప్పినట్లు ఎంబీసీ అధికారులు వెల్లడించారు.

ఇవీ కూాడా చదవండి:

మహిళా ఎంపీకి పార్లమెంట్‌లో చేదు అనుభవం.. ప్యాంట్‌ ధరించి వచ్చినందుకు సభకు అనుమతించని స్పీకర్‌

Etela Rajender Resignation: టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా