OTT Platform: ఓటీటీకి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్..

|

Jan 31, 2021 | 6:12 PM

OTT Platform: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తుండటంతో భారత ప్రభుత్వం దానిపై దృష్టి సారించింది.

OTT Platform: ఓటీటీకి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్..
Follow us on

OTT Platform: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తుండటంతో భారత ప్రభుత్వం దానిపై దృష్టి సారించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ ల పై నియంత్రణ విధించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం నాడు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కీలక ప్రకటన చేశారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను నియంత్రించేందుకు త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేస్తామని తెలిపారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలపై అనేక ఫిర్యాదులు అందాయన్న ఆయన.. దీని నియంత్రణకు సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన వెలువడనుందని చెప్పారు.

కాగా, ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డిజిటల్ న్యూస్ పేపర్లు ప్రెస్ కౌన్సిల్ చట్టం పరిధిలోకి గానీ, సెన్సార్ బోర్డు పరిధిలోకి గానీ, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నియంత్రణ చట్టం కిందకు కానీ రావు. దాంతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఏ కంటెంట్ సినిమాలైనా, వెబ్ సిరీస్‌ని అయినా, పేపర్లు అయినా పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లో విడుదలయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ మధ్యకాలంలో చాలా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా ఇటీవల ‘తాండవ్’ వెబ్ సిరీస్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దానిని నిషేధించాలంటూ పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే.. కేంద్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై విడుదలయ్యే వాటిపైనా నియంత్రణ విధించేందుకు కసరత్తు ప్రారంభించింది.

Also read:

భర్తను హత్య చేసినా కుటుంబ పింఛనుకు భార్య అర్హురాలే, పంజాబ్, హర్యానా హైకోర్టు అనూహ్య తీర్పు

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్… ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్.. ఆ ఏటీఎంలలో డబ్బులు తీసుకోలేం