AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ షాక్‌కు రెడీగా ఉండండి! దుర్భర రోజులు రాబోతున్నాయి.. మొదలైన ధరల మోత!

Big Shock is Coming Soon.. బ్యాంకింగ్ దిగ్గజం ఉదయ్ కోటక్ ఓ వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు. గడిచిన రెండు నెలలుగా యుద్ధం సెగ ఎలా ఉంటుందో మనకు తెలియలేదు. ఇకపై తెలియకుండా పోదు అంటూ.. now it's coming, coming big అంటూ కోట్ చేశారు. సామాన్యులకి ఆ యుద్ధం మంట ఎలా ఉందో తెలియలేదు! ఆ ఎఫెక్ట్ కామన్ మ్యాన్ వరకు రాలేదు కూడా. కానీ, ఆర్థికవేత్తలకు అర్థమవుతోంది. వాళ్లు భవిష్యత్తును చూస్తున్నారు. రాబోతున్న సంక్షోభాన్ని భవిష్యవాణిలో చూస్తున్నారు. జేపీ మోర్గాన్ అయితే.. వచ్చే సెప్టెంబర్ నాటికి ఊహించని సంక్షోభం రాబోతోందని చెప్పేసింది. కొందరైతే.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆయిల్ సంక్షోభం ముంచుకొచ్చి, బ్యారెల్ క్రూడాయిల్ 300 డాలర్లను టచ్ చేస్తుందని ఊహిస్తున్నారు. అదే జరిగితే.. భారత్ సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. అందుకే అంటున్నది.. గెట్ రెడీ ఫర్ బిగ్ షాక్ అని. అసలు ఎవరో చెప్పక్కర్లేదు. హోర్ముజ్ తెరుచుకోకపోతే అత్యంత దుర్భర రోజులు చూడడం కన్ఫామ్. ఆల్రడీ.. పాల ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ ధర 993 రూపాయలు పెరిగింది. ఆటో LPG ధరను పెంచేశారు. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 3 రూపాయల చొప్పున పెంచారు. ఇకపై నూనెలు, పప్పులతో పాటు చీపురుకట్టల దాకా అన్నింటి ధరలు పెరగడం పక్కా. సో, రాబోయేది దుర్భర కాలమే. మోదీ ఓ విజ్ఞప్తి చేసి ఆలోచించండి అని చెప్పేశారు. కాని, ఎకనమిక్ ఎక్స్‌పర్ట్స్ డైరెక్టుగా షాక్‌కు రెడీగా ఉండమనే చెబుతున్నారు. సో, రాబోయే కష్టకాలం ఎలా ఉండబోతోంది.

బిగ్ షాక్‌కు రెడీగా ఉండండి! దుర్భర రోజులు రాబోతున్నాయి.. మొదలైన ధరల మోత!
Indian Economy
Balaraju Goud
|

Updated on: May 15, 2026 | 9:58 PM

Share

కాన్వాయ్‌లో ఓ రెండు కార్లు తగ్గించేస్తే.. ఆయిల్‌ను ఆదా చేసినట్టేనా! మహా అయితే ఓ 10, 20 లీటర్లు సేవ్ చేస్తారేమో! అంతమాత్రానికే రాబోయే కష్టం నుంచి దేశం బయటపడిపోతుందా! అది కాదు దానర్థం. కొనే స్థోమత ఉన్నా సరే.. జేబులో సరిపడా డబ్బుంది, నాకింకా దిగులేంటి అనే ధీమా ఉన్నా సరే.. ఆ దుబారా చేయొద్దు అని చెప్పడమే దీని మీనింగ్. 60 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలున్నాయి మనదగ్గర. రష్యా నుంచో, మరో దేశం నుంచో ఆయిల్ వస్తూనే ఉంది. బట్.. రాబోయే సంక్షోభం అది కాదు. ఇప్పుడు పొదుపు చేయకపోతే, చేతిలో ఉన్న డబ్బు దాచుకోకపోతే, అవసరానికి తగ్గట్టు వాడుకోకపోతే.. ఆల్‌మోస్ట్ రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందనేది కాన్వాయ్‌ల తగ్గింపు వెనక ఉన్న వార్నింగ్ మెసేజ్. లేకపోతే.. మూకుడులో పోసే నూనెను సైతం తగ్గించుకోండి అని ప్రధానమంత్రి అంతటి వ్యక్తి చెప్పడమేంటి? రాబోయేది ఆయిలో, డాలర్ల సమస్యో కాదు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నెలనెలా కట్టే ఈఎంఐలు కూడా పెరుగుతాయి. అదేం లింక్ అనుకోవద్దు. ధరాభారం దేన్నీ వదిలిపెట్టదు. అసలు ధరలు ఎందుకు పెరుగుతాయి. సప్లై తగ్గి డిమాండ్ ఉంటేనే కదా. చేతిలో డబ్బుంటే ఎంత డిమాండ్ ఉన్నా ఆ వస్తువులు కొంటాం. అదే.. చేతిలో డబ్బులు లేకపోతే! ఆటోమేటిక్‌గా డిమాండ్ తగ్గుతుంది. అదే జరగొచ్చు మున్ముందు. సరే.. ఈఎంఐలపై ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనే నిర్ణయం రావడానికి...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి