ZYDUS CADILA: భారతీయులకు మరో గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్‌లోకి జైకోవ్- డీ వ్యాక్సిన్..

|

Jul 01, 2021 | 2:55 PM

దేశంలో త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జైడస్ క్యాడిలా ..జైకోవ్- డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ DCGIకి దరఖాస్తు చేసుకుంది. ఈ టీకాకు సంబంధించి మూడు క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను స్వతంత్ర డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు పర్యవేక్షిస్తోంది.

ZYDUS CADILA: భారతీయులకు మరో గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్‌లోకి జైకోవ్- డీ వ్యాక్సిన్..
Zydus Cadila
Follow us on

భారత్‌లో త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా… తమ జైకోవ్- డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ DCGIకి దరఖాస్తు చేసుకుంది. అనుమతి లభిస్తే ఏటా 120 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రపంచంలో మొట్టమొదటి ప్లాస్మా డీఎన్ఏ వ్యాక్సిన్‌గా.. జైడస్ క్యాడిల్లా పేరొందింది. దేశంలో 12నుంచి 18 ఏళ్ల వయస్సు వారిపై పరీక్షించిన మొదటి కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇదే. కోవిడ్ కేసులపై ఈ టీకా 66.6 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని..మిగిలిన వారిపై 100 శాతం ప్రభావవంతంగా ఉందని తెలిపింది జైడస్.

ఈ టీకా 12 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు సురక్షితమని..అలాగే కరోనా కొత్త వేరియంట్లు, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా కూడా సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొంది. మూడు క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను స్వతంత్ర డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు పర్యవేక్షిస్తోంది.

ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే భారత్‌లో అందుబాలోకి రానున్న ఐదో వ్యాక్సిన్ గా నిలవనుంది జైకోవ్ డీ. మరోవైపు రెండ్రోజుల క్రితమే మోడెర్నా వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు సిప్లా ఫార్మా కంపెనీకి డీసీజీఐ అనుమతి లభించింది.

ఇవి కూడా చదవండి: Anti-Drone System: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌‌కు చెక్.. ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లు

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో వరంగల్ చాయ్ వాలా