Bipin Rawat: వీరుడా వందనం.. బిపిన్ రావత్ దంపతులకు ప్రముఖుల నివాళులు..

CDS బిపిన్‌ రావత్‌కు చివరిసారిగా కన్నీటి నివాళులర్పిస్తున్నారు ప్రముఖులు. కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎంపీలు కనిమొళి..

Bipin Rawat: వీరుడా వందనం.. బిపిన్ రావత్ దంపతులకు ప్రముఖుల నివాళులు..
Bipin Rawat Daughter

Updated on: Dec 10, 2021 | 1:06 PM

CDS బిపిన్‌ రావత్‌కు చివరిసారిగా కన్నీటి నివాళులర్పిస్తున్నారు ప్రముఖులు. కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎంపీలు కనిమొళి, నవనీత్‌ కౌర్‌, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌తో పాటు పలువురు సీఎంలు, ప్రముఖులు, ఆర్మీ అధికారులు రావత్‌ భౌతికకాయానికి అశ్రునివాళులర్పించారు.నిరంతరం దేశ రక్షణ కోసం శ్రమించిన మహోన్నత వ్యక్తి బిపిన్‌ రావత్‌. దేశానికి తొలి త్రివిధ దళాధిపతిగా సేవలందించిన రావత్‌..ఇక కనిపించరని తలుచుకొని విషాదంలో మునిగిపోయింది యావత్‌ దేశం.

ఇక సాయంత్రం సైనిక లాంచనాలతో రావత్‌ దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి. 2గంటలకు రావత్‌ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. కామరాజ్‌ మార్గ్‌ నుంచి కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ క్రిమటోరియం వరకు అంతిమయాత్ర జరుగుతుంది.

బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలకు కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఇక శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌ ఆర్మీ అధికారులు కూడా రావత్‌ అంత్యక్రియలకు హాజరవుతారు.

ఇవి కూడా చదవండి: CDS Gen Bipin Rawat: నేడు జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు.. హాజరుకానున్న శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీఅధికారులు..

Home Remedies: చమటతో శరీరం నుంచి దుర్వాసన వస్తుందా..? ఇలా చేస్తే చక్కటి పరిష్కారం..