Indian Army Helicopter Crash: కుప్పకూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్.. అరుణాచల్ ప్రదేశ్‌లో ఘటన..

హెలికాప్టర్ పైలట్ల కోసం రెస్క్యూ టీం విస్తృత గాలింపు కొనసాగిస్తోందని ఆర్మీ వర్గాలు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం..

Indian Army Helicopter Crash: కుప్పకూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్.. అరుణాచల్ ప్రదేశ్‌లో ఘటన..
Cheetah Helicopter Crashed

Updated on: Mar 16, 2023 | 3:09 PM

భారత సరిహద్దులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మండల హిల్స్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ చిరుత హెలికాప్టర్ కుప్ప కూలిపోయిందని వార్తలు వచ్చాయి. హెలికాప్టర్ పైలట్ల కోసం రెస్క్యూ టీం విస్తృత గాలింపు  కొనసాగిస్తోందని ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం తెలిసింది.

ఘటనకు సంబంధించి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్, PRO డిఫెన్స్ గౌహతి మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమ్‌డిలా సమీపంలో విధుల్లో ఉన్న ఆర్మీ ఏవియేషన్ చిరుత హెలికాప్టర్ ఈ రోజు ఉదయం 9:15 గంటలకు ATCతో సంబంధాలు తెగిపోయినట్లుగా గుర్తించామని చెప్పారు. ఇది మండల సమీపంలో కూలిపోయినట్లుగా నిర్ధారించుకున్నారు. హుటాహుటినా రంగంలోకి దిగిన రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.

ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.