AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Missile Test: భారత సైన్యంలోకి మరో హైపర్‌సోనిక్ క్షిపణి… శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్న సైన్యం

భారత రక్షణ రంగంలోకి మరో హైపర్‌సోనిక్ క్షిపణి వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్‌ ప్రైమ్‌ మిస్సైల్‌ ట్రయల్‌ రన్‌ను సక్సెస్‌‌ అయింది. లద్దాఖ్‌లో అత్యంత ఎత్తులో రెండు మానవ రహిత లక్ష్యాలను చేధించి రికార్డ్‌ సృష్టించింది. అప్‌గ్రేడ్‌ వర్షెన్‌ అయిన ఆకాశ్‌...

Missile Test: భారత సైన్యంలోకి మరో హైపర్‌సోనిక్ క్షిపణి... శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్న సైన్యం
Akash Missile
K Sammaiah
|

Updated on: Jul 18, 2025 | 7:17 AM

Share

భారత రక్షణ రంగంలోకి మరో హైపర్‌సోనిక్ క్షిపణి వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్‌ ప్రైమ్‌ మిస్సైల్‌ ట్రయల్‌ రన్‌ను సక్సెస్‌‌ అయింది. లద్దాఖ్‌లో అత్యంత ఎత్తులో రెండు మానవ రహిత లక్ష్యాలను చేధించి రికార్డ్‌ సృష్టించింది. అప్‌గ్రేడ్‌ వర్షెన్‌ అయిన ఆకాశ్‌ ప్రైమ్‌ మిస్సైల్‌ను ప్రాజెక్ట్ విష్ణు కింద DRDO అభివృద్ధి చేసింది. ఆకాశ్‌ మార్క్‌-1, ఆకాశ్‌ మార్క్‌-1S ఆధారంగా స్వదేశీయంగా రూపొందించింది. ఇది.. ధ్వని కంటే ఎనిమిది రెట్లు వేగంగా ప్రయాణించగలదు. ఈ కొత్త హైపర్‌ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్‌ కంటే చాలా ఎక్కువ వేగంతో పాటు దూరాన్ని కవర్ చేస్తుంది.

సాంప్రదాయ రాకెట్ ఇంజిన్‌కు బదులుగా వాతావరణ ఆక్సిజన్‌ను ఉపయోగిస్తుంది. ఈ క్షిపణి 1,000 నుండి 2,000 కిలోల పేలోడ్‌ను మోస్తుంది. సాంప్రదాయ అణ్వాయుధాలను సైతం తీసుకెళ్లగలుతుంది. ప్రతి లాంచర్‌.. మూడు ఆకాశ్‌ ప్రైమ్‌ మిస్సైల్స్‌ను కలిగి ఉంటుంది. ఇవి ఫైర్‌ అండ్‌ ఫర్గాట్‌ మోడ్‌లో పనిచేస్తాయి. ఒక్కో మిస్సైల్‌ 20 అడుగుల పొడవు, 710కిలోల బరువు ఉంటాయి. వార్‌ సమయంలో దిశను మార్చుకుని మరీ యుద్ధం చేయగల సామర్థ్యం ఆకాశ్‌ ప్రైమ్‌ మిస్పైల్‌కు కలదు. ఇలాంటి మిస్సైల్‌ టెస్ట్‌ రన్‌ను జమ్మూకశ్మీర్‌లోని లద్దాఖ్‌లో భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. 15వేల అడుగుల ఎత్తులో ఈ మిస్సైల్‌ను ప్రయోగించింది. రెండు మానవ రహిత లక్ష్యాలను విజయవంతంగా చేధించింది. ఆకాశ్‌ ప్రైమ్‌ మిస్సైల్‌ టెస్ట్‌ రన్‌ ద్వారా శత్రువులకు భారత్‌ మరోసారి షాకిచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆకాశ్‌ ప్రైమ్‌ క్షిపణి పరీక్ష నిర్వహించడం ఆసక్తిగా మారింది. అందులోనూ.. ఇజ్రాయెల్- ఇరాన్ వివాదంతో పాటు భారత్‌- పాక్‌ ఉద్రిక్తతల వేళ ఈ క్షిపణి ప్రయోగం ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాతో పాటు పాకిస్తాన్‌ను టార్గెట్‌ చేస్తూ ఈ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. ఆకాశ్ మిసైల్ వ్యవస్థ ఆపరేషన్‌ సింధూర్‌లో కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్ వైమానిక దాడులను చిత్తుచిత్తు చేసింది. మొదటిసారి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ఉపయోగించి శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ ఇండికేషన్స్‌ ఇచ్చింది.

ఇక.. ఆకాశ్‌ ప్రైమ్‌ మిస్సైల్‌ టెస్ట్‌ రన్‌ విజయవంతంపై రక్షణమంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలను ఎక్స్‌లో పోస్టు చేసింది. లద్దాఖ్‌లో అధిక ఎత్తులో నిర్వహించిన టెస్ట్‌ ద్వారా ఆకాశ్‌ ప్రైమ్‌ లక్ష్యాలను చేధించడం భారత్‌ రక్షణ వ్యవస్థలో మరో మైలరాయి అని చెప్పుకొచ్చింది. ఆకాశ్‌ వ్యవస్థలోని ప్రైమ్‌ మిస్సైల్‌ భారత సైన్యానికి అప్‌గ్రేడ్‌ వేరియంట్‌ అని తెలిపింది. సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ కోసం ఆకాశ్‌ మిస్సైల్‌ కీలక ఆయుధంగా మారబోతోందన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. ఈ రేంజ్‌ టెక్నాలజీ ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనాలో మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఆ క్లబ్‌లో చేరి భారత్‌ కూడా ప్రపంచంలో నాల్గవ దేశంగా రికార్డ్‌లకు ఎక్కింది. మొత్తంగా.. ఆకాశ్‌ ప్రైమ్‌ మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించి.. చైనా, పాకిస్తాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు అయింది.