జీవితం ఒక వరం.. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడడం కంటే గొప్ప పని.. పుణ్యకార్యం ఈ ప్రపంచంలో మరొకటి లేదని అంటారు. అందుకే అన్ని దానాల్లో కెల్లా రక్త దానం, అవయవదానం గొప్పదని ప్రస్తుతం ఒక స్లోగన్ తో నేటి యువత ప్రచారం చేస్తూ ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా అవయవదానం చేయడంతో మనిషి మరో ప్రాణికి జీవం పోసి.. రెండు సార్లు జీవించవచ్చు అని అంటున్నారు. ఈ విషయాన్నీ చాలా వరకూ అర్ధం చేసుకుని ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయాలనీ భావిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలోని సైన్యం, వైద్యులు ప్రతిరోజూ మరణాన్ని ఎదుర్కొంటారు.
మన దేశ సైన్యం తమ ప్రాణాలను అడ్డు పెట్టి మరీ దేశాన్ని, ప్రజలను రక్షిస్తోంది. అయితే తాజాగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చి మన సైన్యాన్ని చూసి అందరూ గర్వపడేలా మరో అవకాశం ఇచ్చింది. వాస్తవానికి శుక్రవారం వైమానిక దళ అధికారులు పూణే నుంచి దేశ రాజధాని ఢిల్లీకి సమయం వృధా చేయకుండా అవయవాన్ని తరలించారు. ఒక ఒక మాజీ సైనికుడి ప్రాణాన్ని రక్షించగలిగారు.
భారత వైమానిక దళం ఫిబ్రవరి 23 రాత్రి ఆర్మీ ఆసుపత్రి నుంచి వైద్యుల బృందాన్ని పూణే నుండి ఢిల్లీకి తీసుకెళ్లవలసి ఉందని అధికారులకు షార్ట్ నోటీసు అందిందని తెలిపింది.ఒక వ్యక్తి నుంచి సేకరించిన కాలేయాన్ని సమయానికి డెలివరీ చేయాలనీ తెలిపారు. దీంతో ఆర్డర్ అందిన వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ బృందం.. డోర్నియర్ విమానంలో కాలేయం తీసుకుని సకాలంలో రోగి ఉన్న ఆస్పత్రికి తీసుకుని వెళ్ళింది. దీంతో సకాలంలో కాలేయం ఆస్పత్రికి చేరుకోవడంతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. దీంతో ఓ మాజీ సైనికుడి ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు.
వాస్తవంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు 4 నుండి 14 గంటల సమయం పడుతుంది. మన శరీరంలో కొంత భాగాన్ని తీసిన తర్వాత కూడా దానంతట అదే తిరిగి పెరిగే ఏకైక అవయవం కాలేయం. మన కాలేయంలోని కొంత భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించి రోగి శరీరంలోకి అమరుస్తారు. అయితే ఇలా కాలేయంలోని కొంత భాగాన్ని తీసినా తిరిగి .. అమర్చిన ఆ రెండు భాగాలు ఆరు నుంచి ఎనిమిది వారాలలోపు తిరిగి పెరుగుతాయి. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్నవారు అంటే సిర్రోసిస్ తో బాధపడేవారు కాలేయం దెబ్బతింటుంది. పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఈ పరిస్థితిని కాలేయ వైఫల్యం అంటారు. ఈ వ్యక్తులు తరచుగా కాలేయ వ్యాధికి గురవుతారు. దాత కాలేయాన్ని 12 గంటలలోపు రిసీవర్ లివర్‌తో భర్తీ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..