Brahmos Supersonic Cruise Missile: భారత వైమానిక దళం సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. నౌకాదళంతో అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఈ పరీక్షలో క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది. తన కార్యాచరణ సంసిద్ధతను ప్రదర్శిస్తూ, భారత వైమానిక దళం మంగళవారం తూర్పు సముద్ర తీరంలో సుఖోయ్ యుద్ధ విమానం నుండి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. నావికాదళం సమన్వయంతో క్షిపణిని పరీక్షించినట్లు వైమానిక దళం తెలిపింది. క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని గురి పెట్టిందని అధికారులు తెలిపారు.
వైమానిక దళం ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. అందులో, “ఈ రోజు, తూర్పు సముద్ర తీరంలో, వైమానిక దళం సుఖోయ్ 30 MKI విమానం నుండి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించింది. క్షిపణి నిర్వీర్యమైన భారత నౌకాదళ నౌకను నేరుగా లక్ష్యాన్ని తాకింది. భారత నౌకాదళం ఈ పరీక్ష నిర్వహించింది అంటూ పేర్కొంది. 2016లో 40కి పైగా సుఖోయ్ యుద్ధ విమానాలకు బ్రహ్మోస్ గాలి సామర్థ్యం గల వేరియంట్‌లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సముద్రం లేదా భూమిపై పెద్ద ‘స్టాండ్ ఆఫ్ రేంజ్’ నుండి ఏదైనా లక్ష్యాన్ని ఛేదించడానికి IAF సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడనుంది.
Today on the Eastern seaboard, #IAF undertook live firing of #BrahMos missile from a Su30 MkI aircraft.
The missile achieved a direct hit on the target, a decommissioned #IndianNavy ship.
The mission was undertaken in close coordination with @indiannavy. pic.twitter.com/UpCZ3vJkZb— Indian Air Force (@IAF_MCC) April 19, 2022
భారత నౌకాదళం మార్చి 5న హిందూ మహాసముద్రంలో స్టెల్త్ డిస్ట్రాయర్ నుండి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అప్‌గ్రేడ్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించింది. స్టెల్త్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై నుంచి ఈ క్షిపణిని పరీక్షించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది జలాంతర్గాములు, నౌకలు, విమానం లేదా ల్యాండ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ప్రయోగించగల సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేసే ఇండో రష్యన్ జాయింట్ వెంచర్. బ్రహ్మోస్ క్షిపణి మాక్ 2.8 వేగంతో లేదా ధ్వని కంటే దాదాపు మూడు రెట్లు వేగంతో దూసుకుపోతుంది. అధునాతన వెర్షన్ క్షిపణి పరిధిని అంతకుముందు 290 కి.మీ నుంచి దాదాపు 350 కి.మీలకు పెంచారు.
Read Also…. Switzerland man: ఇతడే గ్రహాంతర వాసి..! విచిత్ర రూపంతో హల్‌చల్.. వైరల్ అవుతున్న వీడియో.