Sai Ganesh Suicide: సాయిగణేష్ సూసైడ్ ఇష్యూలోకి సెంట్రల్ ఎంట్రీ.. పరామర్శించిన అమిత్‌షా.. ఇవాళ ఖమ్మంకు కేంద్రమంత్రి!
ఒకే ఒక సూసైడ్ తెలంగాణ పొలిటికల్ చిత్రాన్నే మార్చేస్తోంది. స్టేట్ పాలిటిక్సే కాదు...సెంటర్ కూడా ఎంటర్ కావడంతో...రాజకీయమంతా ఖమ్మం ఖిల్లాకు షిప్ట్ అయింది.
Khammam Sai Ganesh Suicide: ఒకే ఒక సూసైడ్ తెలంగాణ(Telangana) పొలిటికల్ చిత్రాన్నే మార్చేస్తోంది. స్టేట్ పాలిటిక్సే కాదు…సెంటర్ కూడా ఎంటర్ కావడంతో…రాజకీయమంతా ఖమ్మం ఖిల్లాకు షిప్ట్ అయింది. కమలం..కారు వార్ ఎపిసోడ్లో కాంగ్రెస్ ఫ్లేవర్ కూడా యాడ్ కావడంతో…రాజకీయం మరింత ఘాటెక్కింది. అధికార పార్టీని ఇరుకునపెట్టేందుకు అస్త్రాలన్నింటినీ సిద్ధం చేసింది. మరి బీజేపీ కార్యకర్త ఆత్మహత్య అధికార పార్టీ మైలేజ్‌ను డ్యామేజ్ చేస్తుందా…?
ఖమ్మంపై కమలం పార్టీ నజర్ పెట్టింది. బీజేపీ కార్యకర్త సాయిగణేష్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. బీజేపీ స్టేట్ నాయకత్వమే కాదు…ఢిల్లీ అధిష్ఠానం కూఏడా ఖమ్మంపై ఫోకస్ పెట్టడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. బీజేపీకి చెందిన ఓ సామాన్యకార్యకర్త చనిపోతే..ఏకంగా కేంద్రహోంమంత్రి అమిత్ షా ఫోన్‌చేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారంటే ఈ ఇష్యూను ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలుస్తోంది.
పురుగుల మందు తాగి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన సాయిగణేష్ మరణవాంగ్మూలంలో తన చావుకు మంత్రి పువ్వాడ, పోలీసుల చిత్రహింలేనని చెప్పడంతో..రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. స్టేట్‌లో శాంతిభద్రతలు క్షిణించాయంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. గత వారం రోజులుగా పువ్వాడను బర్తరఫ్ చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్, బీజేపీ అధికార పార్టీపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి.సాయిగణేష్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కోరారు. దీంతో అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్నది బీజేపీ పొలిటికల్ ప్లాన్. అందులో భాగంగానే ఇవాళ గవర్నర్ తమిళిసైని బీజేపీ నేతలు కలిసి ఫిర్యాదు చేయనున్నారు.
మరోవైపు టీఆర్‌ఎస్ నేతల తీరుకు నిరసనగా తెలంగాణ బీజేపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్నిజిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టనుంది. సాయిగణేష్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయనుంది. అటు కేంద్రమంత్రి చంద్రశేఖర్ తెలంగాణకు వస్తున్నారు. ఖమ్మంలో సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. బీజేపీ లీగల్ సెల్ కూడా ఖమ్మంలో పర్యటించనుంది. ఇక జోగులాంబ గద్వాలజిల్లాలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..అక్కడే ఆందోళనలో పాల్గొననున్నారు.
Read Also…. Telangana: తండాలో వింత ఆచారం.. అమ్మవారికి ఆ మూగజీవాల బలి.. రంగంలోకి అధికారులు